ఒక్కోసారెందుకో
నాకసలు మాట్లాడ్డమే రాదు.
అప్పుడు...
ఒక మౌనపు వంతెన కట్టి
మెల్లగా కవాతుచేస్తాను.
ఒక నవ్వుల నిచ్చెనేసి
చిన్నగా దాటివెళ్ళిపోతాను.
ఒక నిట్టూర్పుగోపురం కట్టి
ఆకాశాన్ని విభజిస్తాను.
ఎందుకలా చేస్తానో తెలియదు.
తర్వాతేమౌతుందో తెలియదు.
తెలుసుకోవాలనే జిజ్ఞాస;
తప్పించుకోకూడదనే విజ్ఞత...
ఆక్షణాన ఉండదు నాకు.
పెదాలు వర్షించలేని పదాలను
కోలాహలంతో హలాహలంగా మార్చలేను.
అందుకే నేను కొన్ని మట్లాడలేకపోతాను.
మాట్లాడ్డం రాదనుకొంటూ
నిశ్శభ్ధవక్తనై శూన్యసూక్తిని బోధిస్తాను.
ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడితే ఎలాగండి....రాను రాననే చిన్నది దగ్గరికి వస్తే థ్రిల్ కానీ మీరు రావు రావు అని ఇలా మాట్లాడకుండా మాటలు వినిపిస్తే ఎలా :-)
ReplyDeleteవినోద్ అలా అనడం నీకు భావ్యం కాదు
ReplyDeleteఎందుకలా అంటావ్ .
మాంచి కవితలతో ఒకవైపు మమ్ము అలరిస్తూనే.....
మరోవైపు మాట్లాడ్డం రాదనడం...
ఏమన్నా సబబుగా ఉందా చెప్పు.
పంచాయతీ పెట్టించనా అభిమానుల చేత ?
(ఈ మాటలు సరదాకేలే చినబాబు )
" ఒక మౌనపు వంతెన కట్టి
మెల్లగా కవాతుచేస్తాను.
ఒక నవ్వుల నిచ్చెనేసి
చిన్నగా దాటివెళ్ళిపోతాను.
ఒక నిట్టూర్పుగోపురం కట్టి
ఆకాశాన్ని విభజిస్తాను."
ఎంత మంచి భావాలో !!
ఇంతకంటీ ఇంకేం కావాలి మాకు .
చాలా బాగా వచ్చింది మీ కవిత.
అభినందనలు వినోద్ .
*శ్రీపాద
మీకు మాట్లాడ్డం రాదని అంటూ ఎదుటివారికి మాటలు రాకుండా చేసారుగ:-)
ReplyDelete