ఇప్పుడిలా నేను...




నేను చూశాను !
ఒక నిస్తేజమైన ఆలోచన
మస్తిష్కంలో జనించినపుడు
మనోకుడ్యాల్లో ఉత్ఫన్నమయ్యే
వెలుగు రేఖలు మసకబారడాన్ని...

నేను విన్నాను !
ఒక ఉత్తేజమైన పగటికల
ఉవ్వెత్తున ఎగసినపుడు
కంటి పొరల్లో అలికిడయ్యే
నిశ్శబ్ధ కాంక్షల కోలాహలాన్ని...

నేను స్పృశించాను !
ఒక సమ్మోహన వీచిక
గంభీరంగా వాలినపుడు
బాహ్యాంతరాల్లో భారమయ్యే
నిభిడీకృత బహు భావాలని...

ఇప్పుడు
చూడటానికి
ఏ దృశ్యం కనిపించడంలేదు
మసక మబ్బులో
మెరిసే మిణుగుర్లు తప్ప !

వినడానికి
ఏ శబ్ధం కర్ణబేరిని తాడంలేదు
గుండెలో అలజడయ్యే
నిర్మానుష ఘోష తప్ప !

స్పృశించడానికి
ఏ అణువూ మిగలడంలేదు
శున్యమైన మనస్సాక్షితో
శాస్విత కౌగిలి తప్ప !

2 comments:

  1. ఇన్ని చూసావు కదా వినో ఏం చేయలేదు కదా అందుకే ఇంకేం కనిపించిమాత్రం ఏం లాభమని కనబడలేదు అనుకుంటాను. :-) సరదాకి అన్నాను చాలా బాగుంది వినోద్

    ReplyDelete
  2. ఇప్పుడిలా నేను ...
    మంచి భావాత్మకమైన కవిత ఇది .
    నాకు బాగా నచ్చిన కవిత ఇది

    " స్పృశించడానికి
    ఏ అణువూ మిగలడంలేదు
    శున్యమైన మనస్సాక్షితో
    శాస్విత కౌగిలి తప్ప ! "

    ఎంతటి పరిపక్వం నీలో .
    మంచి కవితనందించినందుకు
    అభినందనలు వినోద్

    *శ్రీపాద

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...