ప్రేతాత్మతో ప్రేమ!





కైపెక్కించే నీలికళ్ళ సుందరికి సైటేద్దామంటే
సిసలైన సాఫ్ట్వేర్ ఇంజినీరైతేనే వాటేస్తానంది

సన్న నడుమున్న చలాకీ పిల్లకి ప్రపోస్ చేస్తే
సివిల్ సర్వీస్ లో ఉంటేనే తనకో స్టేటస్ అంది

కాలి గజ్జల కొంటె కోమలాంగిని కోరుకుంటే
కాంట్రాక్టర్ అయితేనే కోరికలు తీరతాయంది

లేత పెదవుల లేటెస్ట్ లేడీకి లవ్ లెటర్ రాస్తే
లాయరైతేనే తనపెదాలతో వాదించగలడంది

వాలుజడ వయ్యారికి చిరునవ్వును విసిరితే
విమానాలు నడిపెవాడివి కాదంటూ కసిరేసింది

ఇవన్నీ కాని నేను ప్రేతాత్మను ప్రేమిస్తానంటే
ప్ర్రాణంలేని తను నా ప్రాణమై ఉండిపోతానంది

6 comments:

  1. అదేమిటో వినోద్.....
    కవిత సాంతం చదివాక కాస్త బెంగే మిగిలింది.
    ఇన్ని సుగుణాలు మనవద్ద లేవే . మరెలా .
    పోనీ సర్డుకుందామంటే చివరి లైన్లు 'పరేశాని' చేసాయి

    " ఇవన్నీ కాని నేను ప్రేతాత్మను ప్రేమిస్తానంటే
    ప్ర్రాణంలేని తను నా ప్రాణమై ఉండిపోతానంది "

    నీ ఇష్టం బాబు . చెప్పేది చెప్పా .
    (సరదా కోసం వినోద్ )

    అదరగొట్టేశావ్ కదా !
    కవ్వింపు - కసిల సమ్మేళనం బావుంది

    అభినందనలు
    *** శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. మా ప్రేతాత్మ చాల మంచిదండి. కనపడదు కానీ... నేనంటే మోజు తనకి!

      Delete

  2. జిలి బిలి పలుకుల జిలేబి ల కి ప్రయత్నించ లేదా మరి !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబీకి ప్రయత్నిద్దామంటే ... రాయచోటిలో జిలేబీ వేసే మస్తాన్భాయ్ కావాలంది...






      Delete
  3. ప్రేమార్పితలాంటి ప్రేతాత్మలు బోలెడంత మంది ఉన్నారన్నమాట....ఇంతకీ ఆ ప్రేతాత్మ ఎవరు? ఏమా కధ!

    ReplyDelete
    Replies
    1. అవునా... ప్రేమార్పిత ప్రేతాత్మ అయినా నాకు ఒకే.... :-) జస్ట్ కిడ్డింగ్

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...