ఒక్కోసారంతే...




ఒక్కోసారంతే...
దేహం నీరసపడ్డప్పుడే
మనసు రెక్కలు తొడుక్కుంటుంది.
కళ్ళు కలల్ని కసిరేసినప్పుడే  
కొత్తలోకం కరచాలనమడుగుతుంది.
ఆశలు ఆవిరుతున్నపుడే
ఎండమావుల కవాతు మొదలౌతుంది.
*  *  *
ఎందుకనో....
పదునైన కోర్కెలను సానపట్టే  
ఈ హృదయానికి దయే ఉండదు.
నిర్దాక్షిణ్యంగా తనను తానే గాయపరచుకుంటుంది.
ఉదయసంధ్యలూ ఏదో ఒక అలజడిని
సాలేగూల్ళలా మస్తిష్కంలో అలికిడి లేకుండా అల్లేస్తుంది.
అమాయకంగా అల్లిన గూడులోనే చిక్కుకుపోతుంది.
*  *  *
అయినా ...
రగిలే కాంక్షని త్యజించాలనుకునే మనిషిలో
యుగాలుగా మార్పే లేదు !!
కాలం మిగిల్చిన కన్నీటి చారికలను
మాన్పే లేపనమే లేదు !!

6 comments:

  1. ఒకోసారి....తప్పదు వినోద్....ఇది జీవితం
    ఎందుకనో....ఆలోచిస్తూ కూర్చుంటే కరిపోతుంది....కాలం
    అయినా.....కన్నీటిని తుడిచే లేపనం......తయారీ కోసమే అందరి తాపత్రయం :-)

    ReplyDelete
    Replies
    1. కామెంటు కూడా కవితలా రాసేస్తారు మీరు... త్యాంక్యు!

      Delete
  2. వినోద్ ఇలాంటి భారమైన భావకవితలు ఎలారాస్తావో ఏమో!

    ReplyDelete
    Replies
    1. వద్దంటే చెప్పండి. మీకోసం కిక్ ఎక్కించేవి రాస్తాను... :-)

      Delete

  3. పదాలని భావాలుగా మార్చి
    భావాలకు పదును పట్టించి
    సాహిత్య లోకంలో చిన్న వాడివైనా
    పెద్దరికం ఆపాదించుకుని
    అద్భుతంగా రాస్తున్నావ్ వినోద్ ( చిన బాబు ) .

    "ఉదయసంధ్యలూ ఏదో ఒక అలజడిని
    సాలేగూల్ళలా మస్తిష్కంలో అలికిడి లేకుండా అల్లేస్తుంది.
    అమాయకంగా అల్లిన గూడులోనే చిక్కుకుపోతుంది. "

    ......... సరదాగా ఉండే మనిషిలో కుడా ఇంతటి
    గాంభీర్య మేమిటని అనుకునేలా కదిలింది నీ కవిత .
    బావుంది వినోద్ .

    ( బాబ్బాబు కాస్తా రిప్లయ్ ఇవ్వండి మా స్పందనలకు ..
    అవి చదివాక అప్పుడైనా అబ్బుతుందేమో కాస్తా
    మాంచి పాండిత్య జబ్బు నాకూనూ )

    అభినందనలు వినోద్

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. చిన బాబు ... అని పిలిచి నన్ను మరీ చిన్నపిల్లాడిని చేస్తున్నారు... మీరన్నట్టు నాకు చిన్న పిల్లాడిగా ఉండిపోవడమే ఇష్టం. పెద్దరికం ఆపాదించకుండా ఉన్నందుకు త్యాంక్యు సో....మచ్ శ్రీపాదగారు...
      మీకోసం ... అన్ని పోస్టులకీ రిప్లై ఇచ్చేసానుగా... కామెంట్లు మాత్రం కవితలా కాక సరదాగా అచ్చం చిన్నపిల్లాడిలా రాస్తాను.. తప్పుగా అనుకోకండి... త్యాంక్యు!

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...