ఏమని ??

కనికట్టుచేసే ఈ కాలాన్ని ఏమని నిందించను
తలవగానే ఇట్టే నిన్ను మోసుకొస్తుందనా?
సడి చేయని నా యదని ఏమని ప్రశ్నించను
నీ తలపుల ధ్యానంలో మూగదైపోయిందనా?

నిట్టూర్పు సెగలకు ఏమని సమాధానమివ్వను
నువ్వు కనికరించడం ఒక కలే అని చెప్పనా?
వలపు ఉచ్వాశలకు ఏమని సముదాయించను
ప్రతి శ్వాసలో నిన్నే పీలుస్తున్నానని ఒప్పించనా?

రెప్ప మూయని కనుపాపను ఏమని ఓదార్చను
ఎదురుచూపుల్లోనే నీకై ఆరాధన బాగుందనా?
ఎడబాటులో రాలే కన్నీటికి ఏమని దారిచూపను
సెలయేరుగా మారి నీ సముద్రంలో కలవమనా?


8 comments:

  1. చెప్పడానికి ఏం మిగిలిందని చెప్పాల్సినవన్నీ చెప్పేస్తే ఆ చిన్నిగుండె ఏం చెప్పగలదు :-)

    ReplyDelete
    Replies
    1. అదేం చెప్తుంది? దానికి నోరు లేదుగా

      Delete
  2. " ఎడబాటులో రాలే కన్నీటికి ఏమని దారిచూపను
    సెలయేరుగా మారి నీ సముద్రంలో కలవమనా? "

    చాలా నచ్చిన వాఖ్యాలివి
    ఎంత బాగా కుదిరాయి చూడూ నీ భావనలు. అభినందనలు వినోద్

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...