ఓయ్ మామా...
అట్టా చుట్టేయమాకు మొద్దు మామ
నాకెట్టో అయిపోతోంది వద్దు మామ

కోరికంత అణచుకోరా కొంటె మామ
కాలుజారితే కష్టమంట మొండి మామ

మీద మీద పడతావు మోటు మామ
నెమ్మదైతే రేయంతా స్వీటు మామ

ముద్దులంటికి పద్దురాస్తే ఎట్ట మామ
సరసంలో లెక్కలేంటి మట్టి మామ

వద్దంటే కావాలని ముద్దపప్పు మామా
హద్దుదాటితే లొంగిపోనా చురకత్తి మామా

రా...మళ్ళీ పుట్టేద్దాం!!


మన సుధీర్ఘ ప్రయాణపు నిట్టూర్పు విడిచిన వాయుప్రవాహం
వసంత కోయిలకు పోటీగా
వెదురువనాల్లో దూరి వేణుగానాలాలపిస్తోంది.

వేసవి చిచ్చులు రాల్చిన నీ కొపపు నిప్పు కణికలు
తనువంతటినీ తడిమి తగలబెట్టినా
మనసు శితలంలో మంచుముక్కలా చల్లబడుతోంది.

నా గుబులు గుండె గవిలో మిణుగుర్లా మెరిసిన సందేహానికి
సమాధి కట్టిన సంశయమేదో
మేధోసంపత్తికి అసంతృప్తిని మిగిల్చింది.

చవకబారు తెలివితేటలు వికటించి
చిక్కి శల్యమైన నా సందేహ దేహం కాస్తా
శిధిలమై శిలాజంగా నిర్వీరమైపోయింది.

పవిత్రంగా నిర్మించుకున్న మన ప్రేమవంతెన మాత్రం
రామసేతులా కలల అలలపై తేలియడి
సజీవంగా మిగిలిపోయింది.

ఇవాల్టి ప్రేమను రెట్టించి
రేపటికి మరింతపొందడానికని నిన్నను నెట్టేసి
కొత్త ప్రభాతమేదో ఉత్సుకతతో ఎదురుచూస్తోంది.

రా... ఎంచక్కా రేపు మళ్ళీ పుట్టేద్దాం!!

నిరీక్షణలో...నిగూఢానికీ నమ్మకానికి నిచ్చెనేసి
నడిమధ్యన నిరంతరమూ నలిగిపోతున్నా !
నా నీడే నకిలీదని నంజిలిపడుతున్నా !!

నా నగవే నడిరేయి నక్షత్రమని
నా నడతే నడిప్రొద్దు నీటిబొట్టని
నాకు నేనే నచ్చకున్నా
నేటికీ నే నటియిస్తూవున్నా !!

నడుమంత్రపు నెయ్యములో
నలిమేనిదొరనై నేను
నడిజామున నలినముతో నర్తిస్తూవున్నా !
నిచ్చెలువ నైజముతో నూత్నమౌతున్నా !!

నీకిది న్యాయమా ??నువ్వెందుకో నన్ను నువ్వనుకొని
అద్దానికి బదులు నా కళ్ళలో చూస్తూ
చలనం లేకుండా ఉండిపోతావు.
చలించని నా హృదయానికి చలిపుట్టేలా
చుంబనాల చక్కిలిగింతలు పెడతావు.
చీరకట్టు అందాలతో రెచ్చగొడుతూ
చిలిపి భావాలని అధరాలపై ఒలికిస్తావు.
నీకిష్టమని పంచెకట్టులో వచ్చి మంచమెక్కితే
అసలు కట్టుకోవడమే సరిగ్గా రాదని
ఇంకా చిన్నపిల్లడివేఅంటూ చాపచుట్టేస్తావు.
నీకిది న్యాయమా ??

మంత్రమేస్తావెందుకు ?వెళ్తూ వెళ్తూ విరహవిషం ఇచ్చి చంపేస్తావు.
వచ్చీరాగానే అమృతాధరాలతో స్పృశించి బ్రతికిస్తావు.
ఇదేంటని అడిగితే
" నువ్వు నావాడివి. ఆమాత్రం హక్కులేదా? "
అంటూ ప్రేమ మంత్రమేస్తావు.
" నువ్వీశ్వరివా? బ్రాహ్మిణివా? " అంటే..
అలిగి మూర్చపోయిన హృదయంపై
నీ మునివేళ్ళతో సుతారంగా రాస్తూ
గోముగా నేను నీదాన్నే కదా అంటావు.
ఇంకేంచేయను .....
చిన్నపిల్లాడిలా నీ ఓడిలో ఒదిగిపోవడం తప్ప...
దొంగలా నీ మనసులో దూరి తిష్టవేడం తప్ప...

ప్రాణం పోక...

అన్నం మెతుకులు ఇకచాలని
కొన ఊపిరితో భరించలేక
చీకట్లో ఉన్నా ప్రభువా!
నీదరి చేర తలుపులెందుకు మూసేవు?

కట్టుబట్టలు దేహానికొదిలి
చావు బ్రతుకుల వంతెనపై
కొట్టుమిట్టాడుతున్నా దేవా!
కనికరించక ద్వారంలో ఎందుకాపేవు?

ధనధాన్యాలను మోసుకెళ్ళలేక
బహు బంధాలను వదులుకొని
నీ బంధీకై వస్తున్నా భగవాన్!
వద్దనుకున్న ప్రాణానికెందుకు కాపుగాసేవు?

ఆమె

ఆమె రోజూ నాముందు నగ్నంగా నిలబడుతుంది.
తన హృదయాన్ని పెనవేసుకున్న
ప్రేమలతని నాకే బహిర్గతం చేస్తూ
మనసు పొరలు విప్పి
మరింత నగ్నంగా, అప్పుడే పుట్టిన కాంతి పుంజ్యం లా
నా ముందు నిలబడి తధేకంగా చూస్తుంది.
నగ్నత్వం తన దేహంలోలేదు,
తర్కించే నా మనసులో ఉందంటుంది.
కోర్కెలు కాలానికి అతీతం కాదంటూనే
కోరి మరీ కళ్ళెం వేస్తానంటుంది.
కైపెక్కించే కళ్ళతో నన్ను కవ్విస్తూ కాల్చేసి,
మరుక్షణమే తన స్పర్శతో బ్రతికించుకుంటుంది.
నా జీవిత దస్త్రంలో
మిగిలిపోయిన కాగితాన్ని తీస్కొని
మరువలేని జ్ఞాపకాలతో నింపేస్తుంది.
నింపేసిన కాగితాన్నీ
వెళ్ళిపోతూ వెంటపెట్టుకుని పోతుంది.

మనసులో అందంగా ముద్రపడ్డ
అందమైన అక్షరాలను తేరిపారా చూస్తూ
దస్త్రంలో మరో తెల్లకాగితాన్ని
అమాయకంగా అతికించి
ఆమె దస్తూరికై రేపటికోసం వేచిచూస్తాను.
ఇవాళ మాత్రం ఆమె ఊహల్లో దాగి
ఊపిరిగా మారిపోతాను.

10-04-2014

ప్రాణమా ... !!

ప్రాణమా ... !!

ఒకే ఒక్కసారి వదిలి వెళ్ళడానికి
ఇంతగా ఊగిసలాడతావెందుకే ?

ముందుగానే వెక్కి వెక్కి ఏడిపించి
ఆపై మమకారం మిగిల్చవెందుకే ?

పత్యంతో ఆయుష్షుని హెచ్చించి
చేరువౌతూ చేజారిపోతావెందుకే ?

వెళ్తూ వెళ్తూ దేహాన్ని అసహ్యించి
కన్నీళ్ళ కెరటాల్లో తోస్తావెందుకే ?

అయినవాళ్ళెవరని పరీక్షలు పెట్టి
అందకుండా వెళ్ళిపోతావెందుకే ?

ఆఖరి శ్వాసను ఆలింగనం చేసుకొని
అదృష్యమై ఆత్మగా మారిపోతావెందుకే ?ఎదురుచూపు...

14
నువ్వు నాకోసం ఎదురు చూసే క్షణాన,
నన్ను నేను ఖాళీ చేసి ఉంచుతాను.
నా నుండి నేను వీడిపోయి
నువ్వెప్పుడు నాలో నిండుకుంటావని
శూన్యమై వేచిచూస్తాను.
నా హృదయాన్ని అద్దంలా పరచి,
నేనైన నిన్ను నాలో ఒంపుకుంటాను.
నీ ఎదురుచూపుల్లో
నన్ను కౌగిలించుకున్న కాలాన్ని
పవిత్రంగా నా జీవితపు గోడలపై లిఖిస్తాను.
స్వచ్చమైన నా మనసుని దోసిలిపట్టి
నీవైన నన్ను నేనే అభిషేకిస్తాను.

04-04-2014

కన్న పేగు వ్యధఎడతెరిపిలేని నీతిసూక్తులు బోధిస్తూ
వింటున్నావని వశపరుచుకోగలనా ?
ఆపాదమస్తకం గమ్యాన్ని నింపేస్తూ
చిగురుటాశలకు కళ్ళెం వేయగలనా?

ఉన్నతంగా జీవించాలని కాంక్షిస్తూ
ఉన్న సంస్కారాన్ని విదిల్చగలనా?
సృష్టిలో కనరాని వింతల్ని చూపిస్తూ
వాడిన మనసును ఆకట్టుకోగలనా ?

వ్యధను పరిచయం చేయకుండానే
విలాసాలకు బానిస చేయగలనా ?
కాలం కన్నీటి రుచిని చూపకముందే
జీవితపు మాధూర్యాని నేర్పగలనా ?

రెక్కలు మొలిచాయని ఎగిరిపోతానంటే
జన్మనిచ్చానని నియంత్రించగలనా ?
పేగు తెంచుకున్నాకే ఊపిరిపీల్చానంటే
కన్న పాపానికి కుమిలిపోక ఉండగలనా?

31-03-2014
Related Posts Plugin for WordPress, Blogger...