W/o. విష్వక్సేన....


తనో హృదయోద్భవ శిల్పం!
ప్రేమ ఉలితో
తనువు మొలచబడి
నవ్వుల్లో మకరందాన్ని వర్షించే
అమృతపుష్పం.....

తనో బాహ్యాంతర అందం!
మదిదీపంతో
ఙ్ఞానం ప్రకాశించబడి
చూపుల్లో కరుణత్వాన్ని కాంతించే
దయాకల్పవృక్షం.....

తనో నిత్యాధ్భుత బంధం!
వలపుగీతంతో
విరహం ఆలపించబడి
వేదనలోనూ వాత్సల్యాన్ని పంచే
కరుణైకసంద్రం.....

3 comments:

  1. విష్వక్సేనుడు వినోద్ పదవిన్యాసంలో భావాలు ఆనందతాండవం ఆడెను ఈ కవితలో.

    ReplyDelete
  2. She is so beautiful in your words.

    ReplyDelete
  3. మీ బ్లాగ్ ని చాలా చక్కగా శింగారించారు. మరి ఆలస్యం ఎందుకు కవితలతో నింపివేయండి.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...