ప్రేయసీ....

 

ప్రేమ అంతిమ లక్ష్యం విషాదమే అని తెలిసి ఎందుకు ప్రేమించాను?

అది అమృతాన్ని చిలికి విషాన్ని మింగిస్తుందని తెలిసి ఎందుకు ప్రేమించబడ్డాను?

కూడికలు, తీసివేతల లెక్కల్లో

సమాధానాలు, సంజాయిషీల సూక్ష్మీకరణల్లో

అంచనాలు, అభియోగాల హెచ్చింపుల్లో

ఎక్కడ పోగొట్టుకున్నానో తెలియని హృదయాన్ని

వెదుక్కునే అవకాశం ఎక్కడ? 

ప్రేమంటే అర్థాన్ని, 

ప్రేమలోని వ్యర్థాన్ని 

ఆరాధనలోని అపార్థాల్ని , 

ఎడబాటు పలికే శాపనార్థాల్ని

సమయం తీసుకోనైనా

సగర్వంగా సమర్పించుకో....

నేనెక్కడికి పోతాను??? 

నీకోసమే కదా వెంపర్లాడుతుంటాను.....

3 comments:

  1. అన్నీ తెలిసీ ప్రేమిస్తే అది ప్రేమే కాదుగా...ప్రశ్న జవాబులు వేసుకుంటే అది ప్రేమ ఎందుకు అవుతుంది పరీక్ష అవుతుంది కానీ...
    పరీక్షా ఫలితాలు వెలువడినాక మళ్ళీ పరీక్ష వ్రాసే అవకాశం ఉంటుందా?
    వ్యర్థంలో, అపార్థంలో, ఎడబాటు పలికే శాపనార్థాల్లో సమయం తీసుకోనైనా తనమనసుతో ఆలోచించి చూడు అన్నింటా ప్రేమయే కనిపిస్తుంది...అప్పుడు ప్రేయసి కాదు ప్రియుడే తనకు తానుగా సమర్పించుకుంటాడని గర్వంతో కూడుకున్న గట్టి నమ్మకం.

    ReplyDelete
  2. బాధతో కూడిన ప్రేమ భావం చక్కగా వర్ణించారు.

    ReplyDelete
  3. ప్రేమ లోతైనది.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...