ప్రేమ పైత్యం!


నేను

అల్పుడిని అయినా

నీ ప్రేమలో అధికుడిని అయ్యాను.


బలహీనుడిని అయినా

నీ మాటలతో బలవంతుడిని అయ్యాను.


మొరటోడిని అయినా

నీ స్పర్శతో మన్మధుడిని అయ్యాను.


అజ్ఞానిని అయినా

నీ తలపులలో కాలజ్ఞానిని అయ్యాను.


కానీ,

ముసలోడిని అయినా 

యవ్వనస్థుడిని కాలేకపోయాను.


ప్రియా....ఏమిటీ వైపరీత్యం??

కొంపదీసి ఇది నా పైత్యం అంటావా???


😀😀😀😀😀😀😀😀😀😀😀😀

2 comments:

  1. మనిషి ముసలోడివి అయితే పర్వాలేదు మనసుని ముసలిదిగా చేసి ముడతలు పడనివ్వకండి.

    ReplyDelete
  2. మార్వలస్స్ తమ్ముడూ...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...