ఈ కవిత చదివితే మిమ్మల్ని మీరు అద్దం లో చూసుకున్నట్టే.. నిజం

రేపటి మనం
(రచన : వినోద్ )



మనం సకల చరాచారులేరుగని

విచిత్ర చేష్టలను కష్టపడి ఆపాదించుకున్న

చండాల స్వభావులం .

నిరంతరం నిప్పు కణికలు

తనలో రగిలించుకునే భానుడికి

మనమేమాత్రం తీసిపోమన్నట్లుగా

మేనిమనస్సులలో ఈర్శాద్వేశాలనే

దహనాగ్నికి ఆజ్యం పోస్తూ

అంకురార్పణ౦ గావించినా

అది మనకే చెల్లు.

సుగమనమునేంచు కూడలిలో

మానవీయతను మంచి మార్గంలో

మలుపు త్రిప్పక

మసకబారిన దృష్టితో

మైకంగ్రమ్మిన కళ్ళతో

పెనువిషాద చాయల అంచులకు

నడిపించేడి మనం

గమ్యమేరుగని గమనానికి పునాదులం.

కవ్వించి ముంచెత్తే

కలికాలపు కెరటాలకు బానిసలం.

ఆగ్రహం పెల్లుబీకిన ప్రకృతి ఒడిలో

పయనించేడి అమాయకులం.

సలిలమార్పని

సెగల పురాణాలకు ఆధ్యులం.

చవకబారిన అస్తవ్యస్త స్వార్థ బ్రతుకులకు

స్వస్తి చెప్పని

నికృష్టపు బలీయులం.
Related Posts Plugin for WordPress, Blogger...