పాచిన అన్నం తినలేక, కడుపు మంటలు తాళలేక .........


పాచిన అన్నం తినలేక
కడుపు మంటలు తాళలేక
ఆకలి మ్రింగిన అశ్రువు నేను.

దెయ్యాన్నెదిరించే  ధైర్యం లేక
వెలుగునీడలను చూడని కన్నులు లేక
చీకటి వెతికిన చావును నేను.

ఓటమినేదురుగ నూహించలేక
చేసిన తప్పులు ఒప్పుకోలేక
భయాన్ని చూసిన నిర్భయం నేను.

కమ్మిన క్రోధపు మార్గం
గాండ్రించిన ఉక్రోశపు దుర్మార్గం
అడుగులు నేర్పని పరుగును నేను.

వర్ణనలేరుగని మర్మపు వచనం
బ్రతుకు అక్షర వర్ణం చూపని
భాషకు అందని భావం నేను.

నయవంచనకు గురైన ప్రేమకి
మృత్యువు ఒడి చేరిన శ్వాసకి
ఆహుతి అవ్వని ఆశయం నేను.
Related Posts Plugin for WordPress, Blogger...