నేను

నేటి కవిత :
నేనునేను నా హృదయానికి ప్రతిబింబం .......
నేను నా ఆశల ప్రతిరూపం ..................
నేను నా సంకల్పానికి సగం బలం .........
నేను నా గమ్యానికి ఆయువు పట్టు ......

నేను ప్రతిక్షణం విజయానికై పరితపించే వినోద పిపాసిని .....
నేను క్షణికానందానికై మొద్దుబారిన మనఃసాక్షిని.................
నేను సుఖ దుఃఖాల సంద్రాన్ని ఈదే గజ ఈతగాడిని .......
నేను అనునిత్యం పోరాడే అలుపెరగని సైనికుడిని ............

నేను ఈ వెలుగు నీడల ప్రపంచం లో జీవితం అంటే అర్థం
తెలియకుండా అంతరించి పోతున్న
ఆఖరి మానవ మృగాన్ని...... వినోద్
Related Posts Plugin for WordPress, Blogger...