పుట్టుక – చావు

పుట్టుక – చావు




పుట్టుక - చావు

మన జీవితాలను శాసిస్తున్న

రెండే రెండు మాటలు .

ఇవి మాటలు కావు

మర్మమేరిగిన మాయలు .

మన జీవితం

ఈ రెండింటికే పరిమితమా..?

ఇవి రెండు మన జీవన

గమనానికి హద్దులా..?

పుట్టుక – చావుల

మధ్య సాగే ఒక సెలయేరు

జీవితం

అయితే దానిపై పయనించాలని

పరితపించే పడవ

మన ప్రాణం .

ఈ చావు బ్రతుకుల మధ్య

వారధి ఈ ప్రాణం .

ఈ రెండింటి మద్య చిన్న ఆంతర్యం

ఈ ప్రాణం .

పదిలంగా దాచుకోవడానికి

పగడం కాదు.

వజ్రమూ కాదు.

ఇది ప్రాణం.

వెల కట్టలేనంత విలువైన

ప్రాణం.

ప్రారంభం లో పూలపాన్పు లా

ప్రశాంతంగా ఉన్నా

గడిచే కొద్దీ గండు తుమ్మేదల్లా

దాడి చేసే వైపరీత్యాలు

జీవితాన్ని అతలా కుతలం

చేసినా అవి ప్రాణం తో

ముడిపడి ఉన్నవే.

ఈ కష్టాల సడలి లో

ఆపసోపాలు పడుతూ

ఒక ప్రాణం ఊగిసలాడుతుంటే

ఇది చాలదన్నట్లుగా

తన ఉనికిని చాటే ప్రయత్నం లో

జీవిత౦ ప్రాణం విలువను

విస్మయిస్తుంది.

మన ఖర్మ కాకపోతే

అదృష్టం లేని మన అరచేయి

ప్రాణాన్ని పణంగా

పెట్టవలసి వస్తుంది.

అసలే తలరాత కు తలోంచిన

ఈ జీవితం ఒక ప్రాణం

నిలబెట్టుకోవడం కోసం

అదృష్టాన్ని అరువు తెచ్చుకోవలసిన

దుస్థితి.

కానీ దురదృష్టం వెక్కిరిస్తే

అదృష్టం అనే అతీత శక్తి అంతమవడం

అతిశయోక్తి కాదు కాబోలు.

విధి విధించిన శిక్ష కి

బానిసలవడం ఎప్పటికైనా తద్యం.

కాదిది మన చరిత్ర ఎరుగని చోద్యం .

-వినోద్

1 comment:

  1. చావు పుట్టుకలలో ఏది గొప్పది?
    చనిపోయే వరకు కష్టం నష్టం సుఖం దుఃఖం
    తీరా చనిపోయాక ఏ ఒక్కటికి లేదు ప్రాప్తం

    చావు పుట్టుకలలో ఏది గొప్పది?
    నేను వస్తాను కనుకనే నీకు ఆదరణ యని ఒకరి మాట
    నీ అస్తిత్వాన్ని అందించేది నేను కనుక యని బహాటంగా తెలిపే మాట

    చావు పుట్టుకలలో ఏది గొప్పది?
    ఊపిరి పోసుకుంటే ధైర్యంగా ముందుకు సాగాలని ఒకటి
    చావనేది ఏరోజైన రాక మానదు నీ గర్వాన్ని అణిచేసుకోమనేది మరోకటి

    ~శ్రీధర్

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...