ఆత్మహత్యేందుకు ...?

ఆత్మహత్యేందుకు ...?
ధుఃఖ సాగరాలను మధించగల మానవా !
స్మశాన సుఖమెందుకు దండగ .


గెలుపు వాకిట విజయబావుటా ఎగురవీసే మిత్రమా!
చితిమంటల చావెందుకు వృధాప్రయాస.


పేకమేడల భవితకు ఊపిరి పోసే నేస్తమా !
ఉరి కోయ్యలతో నేయ్యమేల బ్రతికుండగా .


విధి ఆడే వికృత క్రీడలో పావులు కాదు మనం.
బలిపశువులు అసలు కానేకాదు మనం.


విధినేదిరించడమే మన సంకల్పం.
చావనే నేస్తం మాత్రం దైవాధీనం .


...వినోద్

Related Posts Plugin for WordPress, Blogger...