దేవుడు ఎందుకు కనిపించడో తెలుసా..? ఇందుకే..

ఎవ్వరికీ చెడు చెయ్యని మంచివారికి 
నిత్యం పరీక్షలు పెట్టే కన్నులున్న
ఈ గుడ్డి దేవుడి కళ్ళు పీకేస్తారని......
ఆకలి మంటల ఆర్తనాదాలతో 
అలమటించే అభాగ్యులతో కన్నీళ్లు మింగించే 
చెవులున్న ఈ చెవిటి దేవుడి చెవులు కోసేస్తారని.....
అనునిత్యం అనంత కోటి దండాలతో 
మొక్కే మొండి మనుషులకు మంచి చేయ్యని
కాళ్ళున్నఈ కుంటి దేవుడి కాళ్ళు విరిచేస్తారని.... 
దరిద్రుల చెప్పులు తెగుతాయని...
బానిసలు బందూకులతో కాల్చి చంపేస్తారని....
అవిటివాళ్ళు ఆరడుగుల గొయ్యిలో పాతేస్తారని.....
బదిరులు బండ రాళ్ళతో ముప్పేట దాడి చేస్తారని....
Related Posts Plugin for WordPress, Blogger...