దేవుడు ఎందుకు కనిపించడో తెలుసా..? ఇందుకే..

ఎవ్వరికీ చెడు చెయ్యని మంచివారికి 
నిత్యం పరీక్షలు పెట్టే కన్నులున్న
ఈ గుడ్డి దేవుడి కళ్ళు పీకేస్తారని......
ఆకలి మంటల ఆర్తనాదాలతో 
అలమటించే అభాగ్యులతో కన్నీళ్లు మింగించే 
చెవులున్న ఈ చెవిటి దేవుడి చెవులు కోసేస్తారని.....
అనునిత్యం అనంత కోటి దండాలతో 
మొక్కే మొండి మనుషులకు మంచి చేయ్యని
కాళ్ళున్నఈ కుంటి దేవుడి కాళ్ళు విరిచేస్తారని.... 
దరిద్రుల చెప్పులు తెగుతాయని...
బానిసలు బందూకులతో కాల్చి చంపేస్తారని....
అవిటివాళ్ళు ఆరడుగుల గొయ్యిలో పాతేస్తారని.....
బదిరులు బండ రాళ్ళతో ముప్పేట దాడి చేస్తారని....

2 comments:

  1. అంటే మీరు దేవుడున్నాడని నమ్ముతున్నారన్నమాట. దేవుడేమేమి పనులు చెయ్యాలో మీరే ఎలానిర్ణయించగలరు?
    నా అనుమానమేమంటే పైన చెప్పబడ్డవారిలో మీరు లేరని.

    ReplyDelete
  2. ఇది కేవలం ఆక్రోశ కవిత్వం. ఆత్మాశ్రయమని యెందు కనుకోవాలి? అన్నివిధాలుగా బాగానే ఉన్న దేవుడనేవాడు తమకే వైకల్యాలు ప్రసాదిండంపై తద్బాధితుల ప్రతిస్పందనని కవి యూహూస్తున్నారని భావించితే రమ్యంగానే ఉంది. ఇక్కొకసారి ప్రగాఢమైన ప్రేమవిశ్వాసాలున్నచోటగూడా అపేక్షతోగూడిని నింద వినిపిస్తుంది మనకి. రామదాసు ' నీవుకులుకుచు తిరిగెద వెవడబ్బ సొమ్మని రామచంద్రా!' అని తన రాముణ్ణి నిలదీయలేదా. ఇటువంటిది కొంచెంగా నా శ్యామలీయంలో గూడా కనపడవచ్చును. చూ: http://syamaliyam.blogspot.com/

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...