ఎందుకంటే ...



నాకు రేయంటే ఇష్టం. నిద్రపుచ్చుతుందని కాదు.
నాలో నిద్రిస్తున్న భావాలను మేల్కొలుపుతుందని.

నాకు రాత్రంటే మక్కువ. ఏమీ కనపడనివ్వదని కాదు.
అన్నీ కనబడితే చూడ్డానికి ఇంకేం మిగలదేమోనని.

నాకు చీకటంటే ప్రాణం. లోకాన్ని దాస్తుందని కాదు.
నా అంతరంగంలో దాగిన ఆశలకు అద్దంపడుతుందని.

నాకు నిశీదంటే వరం. మత్తుమందు చల్లుతుందని కాదు.
నా కమ్మని కలలకు ఊపిరిపోసి 'కళ ' గా మారుస్తుందని.

నాకు తామసంటే తేజం. తాపాన్ని రగిలిస్తుందని కాదు.
తనువును మనసుతో పెనవేసి ఉత్తేజాన్ని కలిగిస్తుందని.

నాకు నలుపంటే నమ్మకం. ఏమీ కనపడనివ్వదని కాదు.
కష్టమైనా నష్టమైనా జీవితాంతం నీడై నా వెంటే వస్తుందని.

మనమిద్దరం !!



ఏ సముద్ర కెరటమో వెన్నెల ప్రతిబింబాన్ని
కదలాడే వెండి తివాచీలా పరిచినపుడు;

ఏ తొలకరి మేఘమో చల్లని చిరు జల్లుల్ని
వర్షించే నీటి వజ్రాల్లా కురిపించినపుడు;

ఏ వేకువ కిరణమో బంగారు కాంతి రేఖల్ని
విరాజిల్లే మేటి తేజస్సులా ప్రసరించినపుడు;

పరిమళించే ప్రేమను మదినిండా మోసుకువచ్చిన నీవు.....
ప్రతి నిమిషం ప్రయాసపడి నీ పిలుపుకై పరితపించేనేను.....

ఎప్పటిలానే అప్పుడప్పుడూ ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం!!
ఎప్పుడు కలిసినా అప్పుడప్పుడే ఎప్పుడూ జన్మిస్తూనే ఉంటాం!!

ప్రతి ఉదయం కొత్త జ్ఞాపకాల్ని పేరుస్తూ
ప్రతి రేయీ పాత జ్ఞాపకాల్లో మరణిస్తూ
ఎందుకో తెలియదు మళ్ళీ మళ్ళీ జన్మిస్తాం!
అర్ధంతరంగా మౌనంతో ఇరువురం మరణిస్తాం !!

నన్ను మసిచేసేయ్..






హే భగవాన్.!
నువ్వెక్కడో కనిపించకుండా దాక్కొని
ఎక్కడి కాఠిన్యాన్నంతా భూగోళంపై పోసి
ఏదో కనిపించని ప్రకాశాన్ని
నా గుండెల నిండా నింపేశావ్..
ఇప్పుడు నా కంటిపొరకు
వెలుగు మసక అంటుకున్నది.
ప్రభువా !
ఆ వెలుగులో నేను దహించిపోకముందే
నన్ను నెమ్మదిగా కాల్చేసెయ్..
చీకటి దప్పిక తీరకముందే
నీ మనో నేత్రంతో -  
నన్నొక మసి కిరణం చేసెయ్..

WHY THIS CLASH



I never beat around bush,
even from the cradle.

Sometimes...
the fragrance which has been defusing in my heart,
brings out a resounding slap on my cheek
and it may cried out my attitude.

Many times...
the conscience which has been dictating my mind
throws me between the devil and deep sea
and it may kept in cold my confidance.

Alas ! My transparent soul...
come and iron out my thoughts
between heart and mind.

02/03/2013
Related Posts Plugin for WordPress, Blogger...