వాడు



వాడు

చందమామ వాడి చెలిమికై
వేయికళ్ళతో ఎదురుచూస్తున్నది.
భువనం వాడి ఆగమనానికై
పరితపిస్తున్నది.
వర్షం వాడి స్పర్శకై
వేకున తుషారమవుతున్నది.
అగ్ని వాడి ఆరాధనకై
శీతలాన చలిమంటవుతున్నది.
ప్రకృతి వాడి ప్రేమకై
భూతలాన పూలపాన్పవుతున్నది.
కడలి వాడి అడుగులకై
ఎడారి దారవుతున్నది.
వనదేవత వాడి వలపుకై
వల్లమాలిన అభిమానంతో విలవిలలాతున్నది.
సూర్యచంద్రులు వాడి విశ్వరూప దర్శనానికై
దండకారణ్యాలను సైతం దహించి మరీ ప్రకాశిస్తున్నాయి.

యుగాంతం కాదిది...



తరువులన్నీ తరిగి తరిగి
యెడారి దీవులవుతున్నాయ్...
నదులన్నీ ఉరికి ఉరికి
మురికి నీటి నాళాలవుతున్నాయ్...
ఎండలన్నీ పెరిగి పెరిగి
మండే పెనుతుఫానులవుతున్నాయ్...
మంచు కొండలన్నీ కరిగి కరిగి
మందిని ముంచే త్రాచులవుతున్నాయ్...
సంద్రాలన్నీ మరిగి మరిగి
మౌనపు సునామీలవుతున్నాయ్...
మెరుపులన్నీ మెరిసి మెరిసి
నిశ్శబ్ధపు పిడుగులవుతున్నాయ్...
చిననాటి చద్దన్నపు మూటలన్నీ
పాచి పట్టిన పాశ్చాత్యపు పిజ్జాలై పెనమ్మీద మాడిపోతున్నాయ్...
గంధపు పరిమళాల తనువులన్నీ
అపానవాయువుత్ఫన్న యంత్రాలై ఈ భూమ్మీద వాడిపోతున్నాయ్...
కనులన్నీ
కన్నీటి వరదల్లో కొట్టుకొని పోతున్నాయ్...
మనసులన్నీ
మిన్నంటిన కెరటాల్లో మునిగిపోతున్నాయ్...
సైనిక శక్తులన్నీ
సత్తువల్లేక నిర్వీర్యమవుతున్నాయ్...
అణుబాంబులన్నీ
అవసరాల్లేక అప్రస్తుతమవుతున్నాయ్...
నింగి నేలలు
ఉద్వేగంతొ నాట్యాలాడుతున్నాయ్...
శిలలు శిల్పాలు
పోటీలుపడి ప్రాణాలు పోసుకుంటున్నాయ్...
ప్రకృతిని వేధించిన వారందరూ
ప్రళయ విలయతాండవానికి భయపడి విలవిలలాడుతున్నారు...
ప్రకృతినారాధించిన వారందరు
మాత్రం ప్రశాంతంగా యుగాంతాన్నాశ్వాదిస్తున్నారు...
పడింది.! మరో అధ్భుత ప్రపంచానికి మళ్ళీ ఓ పునాది.
                                                                                                                                            ...Vinod

యువతకు నచ్చని పచ్చి నిజాన్ని


వ్రాశానేనొక చక్కని కవితని
యువతకు నచ్చని పచ్చి నిజాన్ని
విజేత త్యజించిన మత్తు జపాన్ని
కలలు కావివి
కల్లలు కానివి
బల్లలు దద్దరిల్లే నిశ్శబ్ధపు
మిథ్యాలోకం నడుస్తున్నది
బీటలు బారిన అంచుల వెంబడి
కోటలు దాటిన పుకార్ల వెంబడి
నవభారతం నడుస్తున్నది
డబ్బులు మింగే దానయ్యల
వెన్నుపోటు వీరయ్యల నాయకత్వాన
ఎండమావిలో
అడ్డదారిలో
సిగ్గులు లేక ఎగ్గులు లేక
పెగ్గుల వెంబడి డ్రగ్గుల వెంబడి
ఎబ్బుడి ముబ్బడి పబ్బుల వెంబడి
యవ్వన కాంక్షొక విషాద గుంట
షయ్యల సుఖమొక చీకటి మంట
నడిపిద్దాం! మన యువ భారతాన్ని అసభ్య కోరల వెబ్బుల వెంట
Related Posts Plugin for WordPress, Blogger...