నాకు మాట్లాడ్డం రాదు - 2

నాకెందుకో మాట్లాడ్డం రాదు.
మళ్ళీ మళ్ళి ప్రయత్నించినా
పలుకులు పక్కదారి పడుతున్నాయి.
భాష తెలియక నోరు తికమకపడుతోంది.

అంతా నాకే తెలుసని విర్రవీగుతా.
ఆ భ్రమలో వివేకాన్ని మాత్రం కోల్పోతా.
ఏంజరుగుతుందో ఆలోచించకుండా
నా మనసును ఆనందంలో విసిరేస్తా.
మీ మనసుల్ని మాత్రం
బర్నాల్ రాసుకోవడానికి సిద్దం చేస్తా.

అందుకే ఇప్పుడు
నా మాటలు వేన్నీళ్ళై
కాళ్ళపై వొలికిపోయాయ్
మీ మనసులో నేను చేసిన చెరిగిపోని మచ్చ
చిటికెలో నా శరీరంపై గాయం చేసింది.

కలబంద గుజ్జు నా మంటను చల్లారుస్తుంది
మరి మీ మనసులో మంటనూ ???

26/10/2013

2 comments:

  1. మాట్లాడ్డం రాదు అని మనసుని దోచేసారుగా అమాయకంగా :-)

    ReplyDelete
  2. ఇది నిజమేనా! అయితే నాకు మాట్లాడ్డం వచ్చు అన్నమాట..

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...