పచ్చనైన ప్రకృతి వికృత రూపం దాల్చకముందే ...

 http://www.lg.com/us/img/about/bg-about-lg-main.png

పచ్చనైన ప్రకృతి వికృత రూపం దాల్చకముందే ...

స్వచ్చమైన మనసుతో మొక్కలు పెంచుదాం...
పచ్చదనాన్ని పరిడవిల్లజేసే వసంత సామ్రాజ్యంలో ...
గడప గడపకి చిగురాకుల తోరణాలు కడుదాం... 

వేపాకు దెబ్బలు పడనిదె దాపరించిన దెయ్యంవదులుతుందా.!?

http://www.clock-desktop.com/screens/shiny_clock/palms-clock.jpg
కలిసి  రాని వెధవ కాలం
నన్నేపుడు
ఆదరిస్తుందో.!
అర చేతిలో ఇమిడి అదృష్టాన్ని
అందించే సమయం 
నన్నేపుడు 
ఆవహిస్తుందో.!
శాపగ్రస్త అస్తవ్యస్త వ్యవస్థకు
మంచి శకునం
ఎదురొచ్చి నాకు 
విముక్తెప్పుడోస్తుందో.!
కష్టపడి
మూడు ముళ్ళు 
వేపించుకున్న సతీమణి కూడా 
ఇంతగా నాతో ఆడుకోదు.
ఇష్టపడి 
తెచ్చుకున్న మణికట్టు గడియారపు
మూడు ముల్లులు 
నెత్తికెక్కి నన్ను యింత నయవంచనకు
గురిచేస్తే 
ఎవరైనా ఏం చేస్తారులే.!
వేపాకు దెబ్బలు పడనిదె
దాపరించిన దెయ్యంవదులుతుందా.!?

పంచరైన టైరులాగా, చిత్తడైన తోవ లాగా నాకు పాడేక్కే కాలం దగ్గర్లో ఉంది...

http://www.collectorsquest.com/blog/wp-content/uploads/insane_asylum_haiti_holding_head.jpg
ఇంకెన్నాళ్ళు నాకీ బ్రతుకు...
పంచరైన టైరులాగా, చిత్తడైన తోవ లాగా  నాకు పాడేక్కే కాలం దగ్గర్లో ఉంది...
కూడు పెట్టని కొడుకు - పించనివ్వని ప్రభూత్వం - కలిసిరాని  కాలం
ఇవి  మనదేశం లో క్రోత్తేమి కాదు .. కాని
కాటికేగే వయసే నాది.కాని కరుణ చూపని మనసెందుకు మీకు ...
ఇంతవరకూ బ్రతకడానికే ప్రయత్నిన్చానే తప్ప నిజంగా ఇప్పటికీ నేను బ్రతకడంలేదు...
ఎలాగు చచ్చేవరకు బ్రతకాలి కదా.....

ఈ కాలం లో మనందరి బ్రతుకులు ఇలా ఏడ్చాయండి బాబు...

http://fc04.deviantart.net/fs11/i/2006/169/e/0/Black_white_by_AeryValley.jpg
నిలువుటద్దపు ప్రమిద 
చూపదు 
మన అంతః స్వరూపం
ముసుగేసిన మనసు 
తెలుపదు
మన మదపుటెత్తులు
వెంబడించే  చాయ 
సలుపదు
మన వికృత చేష్టలు
అరువు తెచ్చుకున్న 
అబద్దపు
మూటలు మన మాటలు
కరువు విడిచినా కన్నీరు 
రగిలించే
తూటాలు మన బాటలు.
హుతభుక్దహనం 
మిన్న
ఈ స్వార్థపు బ్రతుకుల
కన్నా.

మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.

ప్రపంచ ఆత్మహత్యా నిరోధక దినోత్సవం సందర్భంగా నా కవిత    
కంప్యుటర్ లో నేను గీసిన చిత్రం


ధుఃఖ సాగరాలను మధించగల మానవా !
స్మశాన సుఖమెందుకు దండగ .


గెలుపు వాకిట విజయబావుటా ఎగురవీసే మిత్రమా!
చితిమంటల చావెందుకు వృధాప్రయాస.


పేకమేడల భవితకు ఊపిరి పోసే నేస్తమా !
ఉరి కోయ్యలతో నేయ్యమేల బ్రతికుండగా .


విధి ఆడే వికృత క్రీడలో పావులు కాదు మనం.
బలిపశువులు అసలు కానేకాదు మనం.


విధినేదిరించడమే మన సంకల్పం.
చావనే నేస్తం మాత్రం దైవాధీనం .
 
 
 
- వినోద్
Related Posts Plugin for WordPress, Blogger...