ఆక్రమణ...



నీకూ నాకూ మధ్య
ఎప్పుడూ యుద్ధవాతావరణమే!
భీకరమైన మన పోరులో
నీ చిరునవ్వుల తూటాలు పేల్చి
నా దృష్టిని మరలుస్తావు.
చూపుల శరాలను సంధించి
నన్ను అచేతనుణ్ణి చేస్తావు.
తర్కానికి తిలోదకాలిచ్చి
రణంలో రసపట్టుతో కనికట్టు చేస్తావు.
కనిపించకుండానే నా మనసులో పాగా వేసి
నా అణువణువూ ఆకమించేస్తావు.
నా విద్యల్ని మరిపించేలా చేసిన నికు
యుద్ధతంత్రం బాగా తెలుసని
నిన్ను నేను కీర్తిస్తుంటే నువ్వంటావు...
ఏ తంత్రమూ ప్రదర్శించకుండానే
నేనెప్పుడో నిన్నాక్రమించానని.

8 comments:

  1. గెలుపు ఓటమి ఎవరిదైనా ఒక ప్రణయకవిత పెల్లుబికెను:-)

    ReplyDelete
  2. భావాత్మక యుధ్ధమే చేసారు ప్రేమావేశంలో. కవిత బాగుంది

    ReplyDelete
  3. అలా పోట్లాడుకుంటేనే కదా ఎవరి సత్తా ఏంటో తెలిసేది.:-) అయినా మన అనుకున్న వారిపై తెట్టే అధికారం ఉన్నట్లే పోట్లాడితేనే ప్రేమ పవర్ పెరిగేది :-) బాగాచెప్పానంటారా వినోద్ :-)

    ReplyDelete
  4. ఇలాంటి ఆక్రమణలని ఆపేవారు లేరా...యుధ్ధభూమిని పూదోటగా మార్చలేరా

    ReplyDelete
  5. " నీ చిరునవ్వుల తూటాలు పేల్చి
    నా దృష్టిని మరలుస్తావు.
    చూపుల శరాలను సంధించి
    నన్ను అచేతనుణ్ణి చేస్తావు."

    ఇంకేం మిగిల్చావు ... ?
    మాటలతో ఆక్రమించావ్ కదా వినోద్.
    భలేగా వస్తాయ్ భావనలు మీ కలం నుండి

    అభినందనలు
    *శ్రీపాద

    ReplyDelete
  6. యుధ్ధాలు చేసేంత ఎదిగిపోయావా వినోద్ :-)

    ReplyDelete
  7. ఇంతకీ ఆక్రమించారా ఆక్రమించాలా మీరు :-)

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...