పండని జీవితం



సారవంతమైన నా జీవిత క్షేత్రం లో
క్షణక్షణం క్రమక్షయమే !
గడ్డిపోచనైనా మొలకెత్తించని
నా ఆలోచనా సేద్యానికి,
ఈ గంభీర కాయం విదిల్చిన
ఏ స్వేధబిందువూ సహకరించదు.
కనీసం విత్తునైనా మొలకెత్తించని
నా వేదనాశృవు,
ఉష్ణరుధిరమై ప్రవహించినా
ప్రకృతిలో ఏ అణువూ చలించదు !!

3 comments:

  1. అందరూ రైతన్నలైపోవాలనుకుంటే ఎలా?

    ReplyDelete
  2. " ఈ గంభీర కాయం విదిల్చిన
    ఏ స్వేధబిందువూ సహకరించదు.
    కనీసం విత్తునైనా మొలకెత్తించని
    నా వేదనాశృవు,"
    wow amazing lines

    వినోద్
    నీ కవితలోని నాయకుడు నిస్పృహలో
    ఉన్నాడనిపిస్తుంది. ఏదో ఓ రోజు ఆతని
    జీవితం సారవంతమౌతుంది. వేదాశృవులే
    ఆనందాశృవై ఆతని మనసంతా తీయని
    అనుభూతులతో నిండిపోతుంది.

    బాగా కుదిరింది నీ 'పండని జీవితం' .
    *శ్రీపాద

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...