నేనెవరో...





నీ హృదయ పటాలంలో సూక్ష్మ కణమైనా కాను
ఒక జ్ఞాపకమై యుద్ధం చేద్దామంటే...

నీ మనో క్షేత్రంలో మూలబిందువునైనా కాను
మౌనంగా ఆశలు విన్నవిద్దామంటే...

నీ జీవిత వృత్తంలో వక్ర చాపాన్నైనా కాను
మలుపులో తలుపుగా నిలుద్దామంటే...

నేనెవరని నిన్నడిగితే...
కలలోనైనా దరిచేరనీయని కాకి ఎంగిలంటావు...
అలల్లో కొట్టుకుపోయే ఆశయశూన్యుడివంటావు...
వలలో చిక్కుకుపోయే వలపు వైధ్యుడివంటావు...
దేవుడంటే గిట్టని గర్భగుడి నైవేద్యమంటావు...

నేనెవరో నన్నడిగితే...
ఎప్పటికీ తీరందాటని
కోర్కెలు చంపుకున్న కంపిత కెరటాన్నంటాను...
ప్రతిక్షణం నీ ఎదలోంచి
గెంటేయబడుతున్న కన్నీటి కణాన్నంటాను...

5 comments:

  1. " నేనెవరని నిన్నడిగితే...
    కలలోనైనా దరిచేరనీయని కాకి ఎంగిలంటావు...
    అలల్లో కొట్టుకుపోయే ఆశయశూన్యుడివంటావు...
    వలలో చిక్కుకుపోయే వలపు వైధ్యుడివంటావు...
    దేవుడంటే గిట్టని గర్భగుడి నైవేద్యమంటావు..."

    గొప్ప పదాలతో నిండిన కావ్యమిది.
    పరిణితికి వయస్సుతో నిమిత్తం లేదని
    నీ ఈ కవితతో నిరూపించుకున్నావ్ వినోద్ .
    చిన్నవాడివైనా ప్రతి పదంలో పెద్దరికాన్ని చవిచూపావ్

    కామెంట్ ఏమి రాయాలో ????

    నేనెప్పుడు రాయగలనో ఇంత మంచి భావనలతో
    నిండిన కవితలని.

    బావుంది వినోద్.
    అభినందనలతో,

    *శ్రీపాద

    ReplyDelete
  2. కలలోనైనా దరిచేరనీయని కాకి ఎంగిలంటావు...
    అలల్లో కొట్టుకుపోయే ఆశయశూన్యుడివంటావు...
    వలలో చిక్కుకుపోయే వలపు వైధ్యుడివంటావు...
    దేవుడంటే గిట్టని గర్భగుడి నైవేద్యమంటావు...
    పదునైన పదజాలంలో బంధించి, ఏం తెలీదంటావు

    ReplyDelete
  3. వినోదుబాబూ ఎదిగిపోతున్నావు ధృవతారవై :-)

    ReplyDelete
  4. ఈ కవితా చాలా బాగావ్రాశారు

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...