నాకు మాట్లాడ్డం రాదు-4





ఒక్కోసారెందుకో
నాకసలు మాట్లాడ్డమే రాదు.

అప్పుడు...
ఒక మౌనపు వంతెన కట్టి
మెల్లగా కవాతుచేస్తాను.
ఒక నవ్వుల నిచ్చెనేసి
చిన్నగా దాటివెళ్ళిపోతాను.
ఒక నిట్టూర్పుగోపురం కట్టి
ఆకాశాన్ని విభజిస్తాను.

ఎందుకలా చేస్తానో తెలియదు.
తర్వాతేమౌతుందో తెలియదు.
తెలుసుకోవాలనే జిజ్ఞాస;
తప్పించుకోకూడదనే విజ్ఞత...
ఆక్షణాన ఉండదు నాకు.

పెదాలు వర్షించలేని పదాలను
కోలాహలంతో హలాహలంగా మార్చలేను.
అందుకే నేను కొన్ని మట్లాడలేకపోతాను.
మాట్లాడ్డం రాదనుకొంటూ
నిశ్శభ్ధవక్తనై శూన్యసూక్తిని బోధిస్తాను.

3 comments:

  1. ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడితే ఎలాగండి....రాను రాననే చిన్నది దగ్గరికి వస్తే థ్రిల్ కానీ మీరు రావు రావు అని ఇలా మాట్లాడకుండా మాటలు వినిపిస్తే ఎలా :-)

    ReplyDelete
  2. వినోద్ అలా అనడం నీకు భావ్యం కాదు
    ఎందుకలా అంటావ్ .
    మాంచి కవితలతో ఒకవైపు మమ్ము అలరిస్తూనే.....
    మరోవైపు మాట్లాడ్డం రాదనడం...
    ఏమన్నా సబబుగా ఉందా చెప్పు.
    పంచాయతీ పెట్టించనా అభిమానుల చేత ?
    (ఈ మాటలు సరదాకేలే చినబాబు )

    " ఒక మౌనపు వంతెన కట్టి
    మెల్లగా కవాతుచేస్తాను.
    ఒక నవ్వుల నిచ్చెనేసి
    చిన్నగా దాటివెళ్ళిపోతాను.
    ఒక నిట్టూర్పుగోపురం కట్టి
    ఆకాశాన్ని విభజిస్తాను."

    ఎంత మంచి భావాలో !!
    ఇంతకంటీ ఇంకేం కావాలి మాకు .
    చాలా బాగా వచ్చింది మీ కవిత.
    అభినందనలు వినోద్ .
    *శ్రీపాద

    ReplyDelete
  3. మీకు మాట్లాడ్డం రాదని అంటూ ఎదుటివారికి మాటలు రాకుండా చేసారుగ:-)

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...