అక్షరం ఆయువైతే !





అక్షరం ఇష్టమైనపుడు
నా అందమైన భావాలను
అపురూపంగా మలచి
ఆనందపడ్డాను

అక్షరం నేస్తమైనపుడు
నా అంతరంగ తరంగాన్ని
అనురాగం రంగరించి
ఆవిశ్కరించాను

అక్షరం వ్యసనమైనపుడు
నా అమూల్యమైన అనుభవంతో
అంతరాత్మను అనువదించి
అంతర్మధించాను

ఇప్పుడు అక్షరం ఆయువైంది
నేనే అక్షరమై అంకురించాను
ఇకపై
అక్షరం అక్షరమే ఔతుంది...

1 comment:


  1. " ఇప్పుడు అక్షరం ఆయువైంది
    నేనే అక్షరమై అంకురించాను
    ఇకపై
    అక్షరం అక్షరమే ఔతుంది.".

    అక్షర విలువను,
    అవి చేసే నాట్య భంగిమలను
    ఎంతో అర్ధవంతంగా చూపించావ్
    మీ ఈ కవితలో.
    చాలా బాగుంది మీ కవిత వినోద్ గారు.
    * శ్రీపాద

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...