ట్రాన్స్ఫార్మర్ హార్ట్ !!

ట్రాన్స్ఫార్మర్ హార్ట్ !!



మితిమీరిన ఆశలకు కళ్ళెంవేస్తూ
జీవితపు సరిహద్దులు చేరపనీయక
సున్నితపు అనుబంధాలకు
సన్నని రాగితీగల బంధనాలతో చుట్టి
ఆలోచనా చలానాలను నియంత్రిస్తూ
తార్కికాయస్కాంతత్వానికి లోబడి స్పందించే
ట్రాన్స్ఫార్మర్ హృదయం నాది!!

మెదడూ మనసుల భావజాల వికేంద్రీకరణకు
అనుక్షణం అడ్డుకట్ట వేస్తూ
అంతులేని కోర్కెలకు మనోకారాగారంలో
నిరాశావాద ఖడ్గంతో శిక్షిస్తూ
చిరునవ్వును కవచంగా ధరించి
అనంతానంత దూరాలు సంచరిస్తున్నా!!

శూన్యాన్ని శరీరంలో దాచుకొని
సన్యాసిభావాల ఆత్మకి సహనంతో సమాధి కట్టి
సుదూర తారలను చేజిక్కించుకోవాలని
నా హృదయ దారాల నిచ్చెన జారవిడుస్తున్నా!!

6 comments:

  1. మనసాయరా.....అసలే ఎండాకాలం పవర్ కట్ :-)

    ReplyDelete
    Replies
    1. ఓహో .. నాలో పవర్ ఉందన్నమాట... త్యాంక్యు! :-)

      Delete
  2. అంతులేని కోర్కెలకు మనోకారాగారంలో
    నిరాశావాద ఖడ్గంతో శిక్షిస్తూ
    చిరునవ్వును కవచంగా ధరించి......ఆ కవచమేగా కాపాడేది!
    హార్ట్ టచ్....అందామంటే భయం వేస్తుంది, అసలే "ట్రాన్స్ఫార్మర్ హార్ట్ "!! అని ట్రాన్స్పరెంట్ గా చెప్పారు

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత టచ్ చేస్తే కూల్ అవ్వని హార్ట్ ఉంటుందా? అది ట్రాన్స్ఫార్మర్ అయినా, ఇస్త్రీపెట్టే అయినా... :-) త్యాంక్యు!!

      Delete

  3. "తార్కికాయస్కాంతత్వానికి లోబడి స్పందించే
    ట్రాన్స్ఫార్మర్ హృదయం నాది!! " .......

    ..... అని అన్నావే తప్ప, చాలా మృదువైన భావాలే కవితలో
    మచ్చుకి...

    " మితిమీరిన ఆశలకు కళ్ళెంవేస్తూ
    జీవితపు సరిహద్దులు చేరపనీయక
    సున్నితపు అనుబంధాలకు
    సన్నని రాగితీగల బంధనాలతో చుట్టి
    ఆలోచనా చలానాలను నియంత్రిస్తూ "

    ఇంకా ఆగడ మెందుకు .. అలుపెరుగని విక్రమార్కుడివి .
    దున్నెయ్ బ్లాగ్ నిండా .
    హాయిగా చదువుకుంటాం.
    ప్రశంషనీయంగా ఉంది నీ ఈ కవిత.


    *** శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంసలకు ఎప్పుడూ పీడా అయిపోతాను ... బయటికి చెప్పలేను గానీ నేను మునగ చెట్టు ఎక్కేసానందోయ్... ధన్యవాదాలండి. స్పూర్తిదాయక స్పందనకు. !!

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...