ప్రియతమా...



అందుకో చెలియా...
పరిమళించే ఉఛ్వాసలో ప్రయాణించే నీ విరహ కౌముది
నా మదిని కోసినపుడు రాలిపడ్డ రంపప్పొట్టుని...
పరిత్యజించే నిఛ్వాసలో పారిపోయే నీ వలపు కోయిల
నా ఎదను మీటినపుడు ఊడిపడ్డ వెన్నెలపొడిని...

అందుకే సఖియా...
నేను నువ్వులేక ఖాళీగా తలచిన నీ క్షణాల్ని
అనుక్షణం శిక్షించకు...అందులో నేను లేనని !
నేను నవ్వాగలేక జాలీగా గడిపిన నీ తలపుల్ని
ప్రతిక్షణం బాధించకు...అందులో నువ్వున్నావని !

ఏదేమైనా ప్రియతమా...
నేను కలై వస్తే మూసిన నీ రెప్పలు కదలనీయకు !
నేను అలై వస్తే వేచిన నీ కనులను మూసివేయకు !!

3 comments:

  1. నో డౌట్ ప్రేమలో పడిపోయావు :-) వినోద్

    ReplyDelete

  2. No Doubt ... ఎక్కడో ప్రేమలో పడ్డావ్ .
    పడ్డం కాదు పీకల వరకూ ఇరుక్కు పోయావ్ .

    "ఏదేమైనా ప్రియతమా...
    నేను కలై వస్తే మూసిన నీ రెప్పలు కదలనీయకు !
    నేను అలై వస్తే వేచిన నీ కనులను మూసివేయకు !!"

    అందుకేనేమో అన్నీ ప్రేమతో నిండిన కవితలు .
    ముందుకెల్లు వినోద్ .
    కలసి మరీ ముచ్చటలాడు .
    ( ఏదన్నా ఉంటె నా ఒక్కనికే చెప్పు . అందరికీ తెలుస్తే
    విడ్డూరం అనుకుంటారు )

    నీ కవిత సూపర్ & సూపర్' వినోద్ .

    *శ్రీపాద

    ReplyDelete
  3. మీరూ మా ఇద్దరిలానే :-)

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...