గెలవలేక...



ఆకర్శణాక్షణాలను అపురూపంగా లెక్కించి
ఆనందమంటూ తనువంతా తాకట్టుపెట్టి
అక్కరకు రాని అరవిరిసిన అందం కోసం
అనవసర తాపత్రయం అదిమిపెట్టగలనా

ప్రేమ రుచిలేదని ప్రాయాన్ని పణంగాపెట్టి
పరువాలను సెలయేటి ధారలతో చుట్టి
పనికిరాని పిరికి దేహానికి పవిత్రతంటూ
పసుపురాసి గంధతో పరిమళింపజేయనా

వాడిపోనిది వలపని ఆప్యాయతనాశపెట్టి
వేడి వయసుకు తీపి కలల గంతలు కట్టి
వాంచల వలని చేదించి ఇదే స్వేచ్చంటూ
వెర్రిమనసుకుకిదోవ్యాదని మభ్యపెట్టగలనా

గుబులుగుండెలో చిగురుటాశల గూడుకట్టి
గమ్యం చేరకముందే మెదడుకు గొలుసుకట్టి
గాడితప్పాక దిష్టి తగిలి గాలి సోకిందంటూ
గెలువలేక విధిరాత ఇదని సర్దిపెట్టుకోగలనా

2 comments:

  1. అద్భుతంగా కవిత వ్రాసి...గెలిచేసారుగా

    ReplyDelete

  2. " గుబులుగుండెలో చిగురుటాశల గూడుకట్టి
    గమ్యం చేరకముందే మెదడుకు గొలుసుకట్టి
    గాడితప్పాక దిష్టి తగిలి గాలి సోకిందంటూ
    గెలువలేక విధిరాత ఇదని సర్దిపెట్టుకోగలనా"

    మీ కవిత 'గెలవలేక' బరువైన భాషతో
    మమ్ము బందీని చేసింది వినోద్.

    సూపర్ .. మరో మాట లేదు.
    అభినందనలు.
    *శ్రీపాద

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...