గాయం




నిర్మానుషమైన
నా జీవితానంతంతో
గుండెపగిలిన దాఖలాలు
ఏంటని తొంగిచూస్తే...
నువ్వు ముక్కలు చేసిన
నా మనోశకలాల
కన్నీటి సుడుల్లో
అవి తారసపడుతున్నాయి!
నయనాశృవులు కానరాలేదని
పైకి కానరాని
మనసు కన్నీరుని
ముసలి కన్నీరుగా లెక్కగట్టిన
నీ మానసిక జాడ్యానికి
చెరిగిపోని గుర్తుగా
ముక్కలైన నా హృదయానికి
కుట్లు వేసి
కొత్తరకం అల్లికని
ఒక పేరు పెట్టబోతే
వేసిన కుట్లని లాగేసి
పచ్చి గాయంతో చచ్చిపొమ్మన్నావు.

2 comments:

  1. ఇలా గాయాలు చేసుకుని గేయాలు రాయడం ఏంటి వినోద్ :-)

    ReplyDelete
  2. మనసు ముక్కలు అతికించేసారా వినోద్ :-)

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...