ప్రియా అందుకో ప్రేమలేఖ

 


మన ప్రేమ గురించి ఒక ఖండకావ్యం రాయాలని కలాన్ని  కదిలించా, 

కానీ ఖాండవ వన దహనం గుర్తొచ్చి ఆగిపోయా...


ప్రభంధం రాయాలని పెన్ను పట్టి కూర్చున్నా, 

కానీ హిమాలయాల్లో ప్రవరుడి ఆపసోపాలు గుర్తొచ్చి గమ్మున ఉండిపోయా....


గల్పికలా మన కథని  గమ్మత్తుగా రాయాలని కాగితాలు తీసుకున్నా, 

కానీ గురజాడవారి అడుగుజాడ అంటావాని వద్దనుకున్నా...


దీర్ఘకవిత రాయాలని మన దైనందిన సంభాషణల్ని నెమరువేశా, 

కానీ సినారె అంత సీన్ లేదని అక్షరబద్ధంచేసే  ధైర్యం చేయలేకపోయా...


నవలగా మన ప్రేమకథని రాయాలని ఉర్విళ్ళూరా, 

కానీ ప్రేమకథలకు సరైన సుఖంతం ఉండదని బాధతో ఆ ఊసే మర్చిపోయా...


అందుకే ఏమీ చేయలేక, 

ఆన్లైన్లో అయితే లవ్లీగా ఉంటుందని ఇలా రాస్తున్నా....


తిట్టుకోవు కదూ....

2 comments:

  1. ఏదో విధంగా వ్యక్తం చేస్తే చాలనుకునే వెర్రిది కామోసు మీ ప్రేయసి...ఆలస్యం ఎందుకు అందించడి ప్రేమ లేఖను :)

    ReplyDelete
  2. విస్తుపోయి నోరెళ్ళబెట్టి దరహాసం చిందించినారా మరీ.. అందుకున్నాక ఈ ఈ-లేఖను

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...