ప్రాణమా ... !!

ప్రాణమా ... !!

ఒకే ఒక్కసారి వదిలి వెళ్ళడానికి
ఇంతగా ఊగిసలాడతావెందుకే ?

ముందుగానే వెక్కి వెక్కి ఏడిపించి
ఆపై మమకారం మిగిల్చవెందుకే ?

పత్యంతో ఆయుష్షుని హెచ్చించి
చేరువౌతూ చేజారిపోతావెందుకే ?

వెళ్తూ వెళ్తూ దేహాన్ని అసహ్యించి
కన్నీళ్ళ కెరటాల్లో తోస్తావెందుకే ?

అయినవాళ్ళెవరని పరీక్షలు పెట్టి
అందకుండా వెళ్ళిపోతావెందుకే ?

ఆఖరి శ్వాసను ఆలింగనం చేసుకొని
అదృష్యమై ఆత్మగా మారిపోతావెందుకే ?







4 comments:

  1. వావ్ వేదాంత ధోరణిలో వాడి అక్షరాలు

    ReplyDelete
    Replies
    1. నా అక్షరాల సంగతి తర్వాత.... మీ కళ్ళు మాత్రం భలే ఉన్నాయి...

      Delete


  2. నిండుమని పదహారు ఏళ్ళు మీకు . అదేమిటి అంత వైరాగ్యం.
    కాని అక్కడ కుడా మీదే పైచేయి . భలేగా నడిపించారు మీ శైలిని.
    ఓ "చల్ మోహన రంగా" అంటూ రసవత్తరంగా "మాంచి" పంక్తులు రాయకూడదూ మా కోసం .
    *శ్రీపాద


    ReplyDelete
    Replies
    1. అంటే నేనింకా పెద్దమనిషి కాలేదా:-(( త్యాంక్యు శ్రీపాద గారు...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...