ప్రాణం పోక...

అన్నం మెతుకులు ఇకచాలని
కొన ఊపిరితో భరించలేక
చీకట్లో ఉన్నా ప్రభువా!
నీదరి చేర తలుపులెందుకు మూసేవు?

కట్టుబట్టలు దేహానికొదిలి
చావు బ్రతుకుల వంతెనపై
కొట్టుమిట్టాడుతున్నా దేవా!
కనికరించక ద్వారంలో ఎందుకాపేవు?

ధనధాన్యాలను మోసుకెళ్ళలేక
బహు బంధాలను వదులుకొని
నీ బంధీకై వస్తున్నా భగవాన్!
వద్దనుకున్న ప్రాణానికెందుకు కాపుగాసేవు?





4 comments:


  1. ""అన్నం మెతుకులు ఇకచాలని
    కొన ఊపిరితో భరించలేక
    చీకట్లో ఉన్నా ప్రభువా!
    నీదరి చేర తలుపులెందుకు మూసేవు?""

    ఎంత మంచి భావమో ఇది.
    ఇలాటివి మా వినోద్ కే చాతనవును
    బాగుంది కవిత మిత్రమా.
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్లకు రిప్లయ్ ఇవ్వడం కష్టం. థ్యాంక్స్ తప్పా ఏం చెప్పలేని పరిస్తితి... :-)))

      Delete
  2. ఇలాంటి కవితలు కూడా రాసేస్తారా వినోద్ గారు

    ReplyDelete
  3. ఎలాంటి కవితలైనా కుమ్మేస్తానుగా...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...