కన్న పేగు వ్యధ



ఎడతెరిపిలేని నీతిసూక్తులు బోధిస్తూ
వింటున్నావని వశపరుచుకోగలనా ?
ఆపాదమస్తకం గమ్యాన్ని నింపేస్తూ
చిగురుటాశలకు కళ్ళెం వేయగలనా?

ఉన్నతంగా జీవించాలని కాంక్షిస్తూ
ఉన్న సంస్కారాన్ని విదిల్చగలనా?
సృష్టిలో కనరాని వింతల్ని చూపిస్తూ
వాడిన మనసును ఆకట్టుకోగలనా ?

వ్యధను పరిచయం చేయకుండానే
విలాసాలకు బానిస చేయగలనా ?
కాలం కన్నీటి రుచిని చూపకముందే
జీవితపు మాధూర్యాని నేర్పగలనా ?

రెక్కలు మొలిచాయని ఎగిరిపోతానంటే
జన్మనిచ్చానని నియంత్రించగలనా ?
పేగు తెంచుకున్నాకే ఊపిరిపీల్చానంటే
కన్న పాపానికి కుమిలిపోక ఉండగలనా?

31-03-2014

5 comments:

  1. Last four lines are heart touching.

    ReplyDelete
    Replies
    1. అంటే మిగిలినవి సుద్ధ వేస్ట్ లైన్స్ అనా??? :-) త్యాంక్యు!!

      Delete
  2. ఎన్ని ప్రశ్నలు ఉబికి వచ్చాయి నీ మస్తిష్కంలోనుండి వినోద్.
    పిన్న వయసులోనే సాహిత్యంలో పండి పోయావ్.
    పదునైన భాషతో , పదిలంగా పొందు పరిచిన మీ ఈ కవిత బాగుందనను .....
    చాలా బాగుందంటాను.
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. అంటే నేనింకా చిన్న పిల్లవాన్నేనా?? శ్రీపాద గారు.... వెంటనే నన్ను పెద్ద వాణ్ని చేసేయండి..

      Delete
  3. ఎన్ని ప్రశ్నలు ఉబికి వచ్చాయి మీ మస్తిష్కంలోనుండి వినోద్.
    పిన్న వయసులోనే సాహిత్యంలో పండి పోయావ్.
    పదునైన భాషతో , పదిలంగా పొందు పరిచిన మీ ఈ కవిత బాగుందనను .....
    చాలా బాగుందంటాను.
    *శ్రీపాద

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...