ప్రేమ ఒక యాత్ర !!

రా పయనిద్దాం !
ఆకాశం ఆనందాన్ని కోల్పోతే
మన ప్రేమని హరివిల్లును చేసి
సృష్టికే రంగులద్దుదాం !!
విరహ రెక్కల్ని కట్టుకొని
వలపు విహంగాలమై
విశ్వమంతా విహరిద్దాం !!

రా పయనిద్దాం !
సెలయేరు సెలవంటూ ఇంకిపోతే
మన ఊసుల్ని సలిలంగా మార్చి
సంద్రాన్నే నింపేద్దాం !!
సరస సరస్సులు దాటి
స్వచ్చమైన చినుకులమై
ప్రపంచాన్నే తడిపేద్దాం !!

రా పయనిద్దాం !
వనం వాడిపోయి విలపిస్తే
మన ప్రణయాన్ని పచ్చికలా చేసి
నేలంతా పరిచేద్దాం !!
ఎండు కొమ్మల్ని తాకి
పచ్చని చిగురుటాకులమై
ప్రకృతినే పులకరిద్దాం !!


2 comments:

  1. ఇంకేం మీ ప్రేమప్రయాణం సుఖవంతం కావాలని ఆశిస్తాం :-) చిత్రంలో ప్రేమనంతా కుమ్మరించారుగా

    ReplyDelete
    Replies
    1. ఎప్పుడు చూసినా మీరే కామెంటతారు... నా బ్లాగ్ లో...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...