ఇంకో డెఫినేషన్... LOVE

ఆశల పూబంతులు ఎగసి
మనో కుడ్యాలపై
కూచిపూడి నృత్యమాడితే
పులకరించిన తొలిప్రాయానికి
చిగురించిన చిరు ఇష్టం
' ప్రేమ '
ఎడబాటులో మాధుర్యం
' ప్రేమ '

తలపుల తడి ఆరని
వలపుల వాన జల్లు కురిస్తే
రెండు హృదయాల రాపిడికి
గర్జించిన తొలి ఉరుము
' ప్రేమ '
సంఘర్షణలో కొస మెరుపు
' ప్రేమ '


4 comments:

  1. ప్రేమతత్వం చెప్పారా వినోద్ గారు :-)

    ReplyDelete
    Replies
    1. కవిత్వం కదా నేను చెప్పింది... మీరింకేదో అంటే ఎలా??

      Delete
  2. మొత్తానికి ప్రేమంటే ఉరుములూ, మెరుపులూను... మధ్యలో ఘర్ణణలు... చిట్టచివరికి మనసుల మధ్య యుద్ధం అంటారు. బాగుందండీ.

    ReplyDelete
    Replies
    1. అయితే మీకు యుద్ధం బాగుంటుందన్నమాట :))

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...