ఎందుకో ఏమో ??!!



ఆశలు చిగురిస్తూనే ఇన్ని ఆంక్షలెందుకో ?
ఆమని పలకరిస్తూనే అకాల కరువెందుకో?

మాయని గాయానికి తీపి లేపనమెందుకో?
ఎగిరిపోని మనసుకి ఊహల రెక్కలెందుకో ?

కరిగిపోయే కాలానికి కరుణసలే లేదెందుకో ?
తరిగిపోయే యవ్వనానికి కోర్కెల సెగలెందుకో?

సేదతీరే దేహానికి విశ్రాంతికై తీరిక ఉండదెందుకో?
పారిపోయే ఆయుష్షుకి ప్రాణంతో పనిలేదుందుకో?

చేయని తప్పుకు సమర్థనల సముదాయింపులెందుకో?
మూసిన భావాలకు బయటపడాలని ఆవేశమెందుకో ?

చెరగని ప్రేమ ధార రాతి మనసును మార్చలేదెందుకో?
తెరచి ఉన్న కన్నులు కన్నీటికి సాక్షాలౌతాయెందుకో ?

2 comments:

  1. నిజమే..,అన్నీ ఉన్నా ఇంకా ఈ అక్షర దారివెంట ఈ పయనమెందుకో.,
    చాలా బాగుంది సర్ మీ కవిత.

    ReplyDelete
    Replies
    1. అక్షరమే వ్యసనం కాబట్టి... ఫాతిమా జి.... త్యాంక్యు

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...