అందుకో విజయం

ప్రభాత కిరణం అడ్డొస్తే
విధాతవై నువు ప్రాణం పొయ్..

నదీనదాలు నిను ముంచేస్తే
పదేపదే పోరాటం చెయ్..

నిశీధి రెక్కలు ఆడించి, నిందలు తోకలు జాడిస్తే
శిలలా మారక శిధిలం అవ్వక
శాంతంతో మనసు కప్పేసెయ్
సహనంతో ముందుకే అడుగేసెయ్

కాలం నిప్పులు కురిపించి ఇంద్రజాలం విధిలా ఆడిస్తే
నిరాశనోదిలీ నిస్పృహవీడి
నటరాజువై నువు నృత్యం చేయ్
వాటన్నిటి భరతం పట్టేసెయ్

నలు దిక్కులు సుడిలా చుట్టేస్తే
నక్క జిత్తుల వలలూ మాటేస్తే
పై ఎత్తుల కొరడా ఝుళిపించెయ్
గమ్మత్తుగ గెలుపును ముద్దాడెయ్

27/10/2013


2 comments:

  1. పవర్ ఆఫ్ విష్వక్సేన వినోద్ కలం.......

    ReplyDelete
  2. పవల్ ఇన్ లిటిల్ వోల్ట్స్...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...