మన బంధం


నిజంగా ఎప్పుడోఒకప్పుడు
ఖచ్చితంగా నీదరికొస్తాను
నెమ్మదిగా నగ్నంగా మారి
నీలో నిమగ్నమై కలిసిపోతాను
నీకు బాగా తెలుసు..
నాక్కూడా తెలుసు...
నా మనసుకు మిక్కిలి సౌఖ్యాన్నిచ్చేది
నీ నులివెచ్చని కౌగిలేనని
నేనక్కడే భద్రంగా ఉంటానని
అందుకేనేమో నువ్వు నిరభ్యంతరంగా
నా చుట్టూ పరుచుకుంటావు
శాశ్వితంగా నాకు ఆనందాన్ని పంచుతావు
ఒక్కసారి ఏకమైతే
ఇంకెవ్వరూ మనల్ని విడదీయలేరు
ఎవ్వరికీ అంతుచిక్కకుండా
యాద్రుచ్చికంగా నీ ఒడిలో వాలిపోతాను
నన్ను నీలో కలిపేసుకుంటావు కదూ...
తప్పకుండా కలిపేసుకుంటావు.
ఎందుకంటే నేను చచ్చిపోతే నా దేహాన్ని
నువ్వు తప్ప ఇంకెవరూ కౌగిలించుకోలేరు.
నువ్వు తప్ప నన్నెవరూ నీలో కలిపేసుకోలేరు
ని(మ)న్ను తలా పిరికెడు నాపై వెదజల్లి
మనిద్దర్నీ ఏకం చేసి... ఉన్న బంధాలన్నింటినీ తెంపేసుకుంటారు
ఇదిగో...వచ్చేస్తున్నా సిద్ధంగా ఉండు

3 comments:

  1. శాశ్వితంగా నాకు ఆనందాన్ని పంచుతావు
    ఒక్కసారి ఏకమైతే
    ఇంకెవ్వరూ మనల్ని విడదీయలేరు
    ఎవ్వరికీ అంతుచిక్కకుండా
    యాద్రుచ్చికంగా నీ ఒడిలో వాలిపోతాను
    నన్ను నీలో కలిపేసుకుంటావు కదూ....ఇలా కూడా రాయగలరా! చాలా బాగుంది

    ReplyDelete
  2. అత్యున్నత భావ కవిత

    ReplyDelete
  3. నువ్వు తప్ప ఇంకెవరూ కౌగిలించుకోలేరు ...
    ని(మ)న్ను తలా పిరికెడు నాపై వెదజల్లి ...

    హృదయాన్ని కదిలిస్తూ వ్రాశారు ...
    kudos ...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...