వెళ్ళిపో....



వద్దు
ఎందుకిలా మనసు చట్రాన్ని తిప్పుతావ్?
నన్ను పూర్వపు జ్ఞాపకాల లోయల్లో
ఎందుకలా నెట్టేయాలని చూస్తావ్?

నీకు నాపై ప్రేమో...పిచ్చో కావచ్చు
వలపో...వ్యామోహమో ఉండొచ్చు...
నువ్వు నా ఆస్వాదనలో స్వాంతనో...
నా ఆరాధనలో సంతోషాన్నో పొందొచ్చు...
నానుంచి మాత్రం స్వచ్చమైన ప్రేమని
ఖచ్చితంగా ఆశించలేవు.

గతం పొదల్లో దాగిన
మొగలిపరిమళాల్ని నీకోసం పంచలేను.
వ్యాపకాలైన నా కొన్ని జ్ఞాపకాల్లో
నిర్ధాక్షణ్యంగా నిన్ను నెట్టేస్తాను.
అంతేకానీ
నీపై వల్లమాలిన వలపు కురిపించలేను....

ప్రేమిస్తూ బ్రతకడంలో హాయుందని తెలుసంటావు...
మరి అది దక్కకపోతే మనసు రాయౌతుందని తెలుసుకోలేకపోయావా...

నాలోలోపలికి ఎంత తవ్వినా
నా నవ్వు తప్ప ఇంకేం కనపడదు నీకు
బంధాలూ... ఆప్యాయతలూ... అన్నీ సన్నాయి రాగాలే
ఒక్కసారి మూగబోయేంతవరకూ
వాటి కర్కశత్వం తెలియరాదు...

పో.. వెళ్ళిపో ...
నన్ను దాటుకొని... ప్రెమరాహిత్యాన్ని మూటగట్టుకుని...
ఎటైనా వెళ్ళి స్వార్థంతో బ్రతుకు..
మూగ మనసంటూ...
భావాల్ని మూగబోనివ్వకుండా నిర్భయంగా బ్రతుకు...
మనసు మాట వినదంటూ వెర్రి ఆశలతో
ప్రేమకు నా అనుమతికై కాలయాపన చేయకు...
వెళ్ళు... నానుంచి దూరంగా వెళ్ళిపో .....

3 comments:

  1. "నానుంచి మాత్రం స్వచ్చమైన ప్రేమని ఖచ్చితంగా ఆశించలేవు"
    ఇంత ఘోర పరాభవమా ప్రేమించిన వారికి :-)

    ReplyDelete
  2. వినోద్ పొమ్మని రమ్మని ఏదేదో రాసేస్తున్నావు. :-)

    ReplyDelete
  3. నాలోలోపలికి ఎంత తవ్వినా
    నా నవ్వు తప్ప ఇంకేం కనపడదు నీకు
    బంధాలూ... ఆప్యాయతలూ... అన్నీ సన్నాయి రాగాలే
    అసలు తవ్వడం ఎందుకో...ఏం సాధించాలని

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...