అఫీషియల్ లవ్వు లేఖ!


నీ చిరునవ్వును నే రాసుకున్న చిత్తుప్రతిలో
ఆమోదాద్యాక్షరమని నా వలపులేఖను నివేదిస్తూ
విరహాక్షరాలతో నిండిన నా హృదయ దస్త్రాన్ని
నీ ప్రేమముద్రకై అర్జీ పెట్టుకుంటున్నా ప్రియా!


అసంతృప్తితో అదనపు అర్హతల సంజాయిషీకై
పరిపరి విధాల ప్రత్యుత్తరాలు జరగాలంటూ
దయచేసి వాయిదాల ఆజ్ఞలు జారీచేయకని
బేజారి మోడుబారిన ఎదతో నివేదిస్తున్నా!

ప్రణయాన్నిమోదంతో ఆమోదిస్తావో
ప్రయాణాన్ని ఖేదంతో తిరస్కరిస్తావో
అర్హతకై స్వదస్తూరితో రాసిన ఆఖరి కాగితంలో
సమాధానంగా నీ తీపి సంతకం కోసం నిరీక్షిస్తున్నా!

ఆఖరిగా ఒక్క విన్నపం!
నీ తిరస్కారాన్ని బహిరంగంగా గస్తీపత్రంలో ముద్రించకు
సమ్మతమైతే నీ ఉత్తర్వులను శాసనాలుగా జారీచెయ్యి!!

4 comments:

  1. intaki table paina letter petti
    table kinda weight pettadam maruvakandi:-)

    ReplyDelete
  2. లెటర్ పోస్ట్ చేశారా వినోద్గారు, లేక పోస్ట్ కార్డ్లు లేవంటారా ;-)

    ReplyDelete
  3. ఇదేం లవ్వో ఏంటో :-)

    ReplyDelete
  4. అమోద యోగ్యతకై కొన్ని ధృవీకరణ పత్రాలతో మీరు ఆమెను సంప్రదించండి.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...