దగ్ధమైన నిప్పుకణం ..

ఎందుకో ఏమో! మంటలు ఆర్పడానికని
ఇంకో మంట నుండి పురుడు పోసుకున్న
ఒక నిప్పు కణం హడావిడిగా బయలుదేరింది.

కాలుతున్న దట్టమైన ఎద కనుమలను ఆర్పడానికంట.
కృంగిపోతున్న మనసు చెట్టును మొలిపించడానికంట.
పొంగిపోతున్న కన్నీటి ఉప్పెనలను అడ్డుకునేందుకంట.

ఎంత ధైర్యమో దానికి
ఆలోచనా శకలాల్ని తట్టుకుంటుందా?
ఆవేశపు భావాలను భరిస్తుందా?
కోల్పోయిన నవ్వులను పూయిస్తుందా?

ఏమో! ఎవరికి తెలుసు?
దాని నమ్మకమే దాని శక్తేమో!
దాని ధైర్యమే దాని యుక్తేమో!

గాలి ఎటు వీస్తే అటు పరిగెడుతోందది.
కానీ ఏ వర్షానికి ఆరిపోవడం లేదు.
బాధలెక్కడున్నాయో గాలిస్తోందది.
కానీ తన సంతోషాన్ని వదులుకోవడం లేదు.

గాయాలను నయం చేయడానికని ప్రయత్నిస్తోంది.
తనకు గాయాలు అవ్వకుండా జాగ్రత్తపడుతోంది.
కష్టాలు తొలగించడానికి తిరగాడుతోంది.
తనకు కష్టాలు రాకుండా తప్పించుకుంటోంది.

ఆ నిప్పు కణం కర్తవ్యమేంటో?
అసలు దాని గమ్యమేంటో?
తీరా బయలుదేరేసాక
ఇప్పుడు సంధిగ్ధంలో పడి దగ్ధమౌతోంది.

09/11/2013



4 comments:

  1. ఆ నిప్పుకణికలు ధగ్ధమైతేనే వెలుగురేఖలు విచ్చుకుంటాయేమో......ఆశావాదం :-)

    ReplyDelete
    Replies
    1. మీ ఆశావాదం నచ్చింది పద్మ గారు. ధన్యవాదాలు.

      Delete
  2. చక్కని కవిత వినోద్ గారు

    ReplyDelete
    Replies
    1. చక్కని కామెంట్. ధన్యవాదాలండి.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...