క్రిప్టో ట్రేడింగ్... ఇండియా స్ట్రాటజీ??? (బిట్ కాయిన్స్, ఎథిరియం, రిపుల్)


ప్రపంచంతో పాటు పరిగెత్తడంలో సామాజికంగా 100 సంవత్సరాలు, ఆర్థికంగా 50 సంవత్సరాలు, టెక్నాలజీ పరంగా 35 సంవత్సరాలు భారత్ వెనకబడి ఉంది. Gross National Happiness Index, UNDP Human Devolepment Index వంటి ఐక్యరాజ్య సమితి నివేదికల్లో మనం పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాలతోనే కాకుండా BRICS కూటమి (భారత్, చైనా, బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా) లో కూడా అధములై ఉన్నాం అన్న విషయం తేట తెల్లం అవుతుంది. గడచిన మూడేళ్ళలో ఏ రంగం చూసినా గత సంవత్సరాలకంటే దేశ G.V.A. (జాతీయాదాయంగా పరిగణిస్తారు) లో భారీగా వాటాలు పతనం అయ్యాయి. మూడు సంవత్సరాల్లో మన వృద్దిరేటు దారుణంగా దిగజారింది. తోళ్ళ ఎగుమతులు, సాఫ్ట్వేర్ ఎగుమతులు శుష్కించాయి. వ్యవసాయం, మ్యానుఫాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రికల్, ఫైనాన్సు, రియలెస్టేట్ వరకూ ఏ రంగం చూసినా కోలుకోలేని స్తాయిలో దిగజారాయి. ఎటొచ్చి డిఫెన్స్ వాటా పెరిగినా కొత్త దాడులు పెట్రేగిపోయున్నాయి. డీమానిటైజేషణ్ సమయంలో బిలియన్ డాలర్ల F.D.I. లు దేశం విడిచి వెళ్ళాయి. ఒకరకంగా భారత ఆర్థిక పరిస్తితి అంత ఆశాజనకంగా లేదు.
ఆంధ్ర ప్రదేశ్ పరిస్తితి అయితే మరీ దారుణంగా ఉంది. రెవెన్యు రాబడులు, చేసుకున్న అప్పులను అన్నింటినీ అనుత్పాదక రంగాల్లో కుమ్మించడం వల్ల అటు దేశం ఇటు రాష్ట్రం పరిస్తితి అధ్వాన్నంగా ఉన్నాయి. జనాల్ని దేశభక్తి, ఆవులూ, తొక్కా తోలూ అంటూ పనికిరానివాటిపై మళ్ళించి ఆర్థిక వ్యవస్తను చిన్నాభిన్నం చేస్తున్నారు.




అయితే, టెక్నాలజీ మరియూ ఆర్థికవ్యవస్థ రెండింటి కాంబినేషన్ క్రిప్టో కరెన్సీ. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లోని సంపన్నుల్లో, MNC లలో ఇది హాట్ టాపిక్. చైనా వంటి దేశాలు ఏకంగా సొంత క్రిప్టో కరెన్సీ తయారుచేసే పనిలో పడ్డాయి. అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాల్లో మధ్య తరగతి నుంచి సంపన్న బహుళజాతి కంపెనీల (MNC) దాకా క్రిప్టో కరెన్సీలయిన బిట్ కాయిన్, ఎతీరియం, రిపల్ వంటివాటిపై గుత్తాధిపత్యం సాధించాలని తహతహ లాడుతున్నాయి. భారత్ లోని కొందరు మదుపరులు క్రిప్టో కరేన్సీల్లో ట్రేడింగ్ చేస్తున్నారు. సామాన్య జనాలకు తెలియని ఈ క్రిప్టో కరేన్సీల్లో మన M.N.C.లు, అంబానీ ఆదానీలు కోటాది కోట్లు కుమ్మరించి మార్కెట్ను శాశిస్తున్నారు. ఇండైరేక్ట్ గా సైబర్ దాడులను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే జే.పి. మోర్గాన్ వంటి కంపెనీలు క్రిప్టో కరెన్సీ ఒక బూటకం అని గాలి వార్తలు (grapevinen) ప్రచారం చేసి క్రిప్టో కరెన్సీ అయిన బిట్కాయిన్ విలువను దిగజార్చాయి. తర్వాత బినామీ పేర్లతో కొట్లలో బిట్కాయిన్లు కొనేసి సామాన్య మదుపరులకు టోపీ పెట్టాయి. టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సంపన్న మదుపరులు ఏకంగా కొన్ని గ్రూపులు ఏర్పాటు చేసుకొని మూకుమ్మడిగా మార్కెట్ ను శాసిస్తున్నారు. చైనా వంటి కొన్ని చేశాలో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజిలను బ్యాన్ చేస్తున్నారు. కొత్త క్రిప్టో కర్రెంసీలు తయారు చేసుకుంటున్నారు. ప్రపంచానికి విస్తరిస్తున్నారు.

ప్రపంచ దేశాలు ఇలా కొత్త వాటిని అందిపుచ్చుకుంటుంటే భారత్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు కూడా వీటిపై కనీస అవగాహన లేదు. ఇక మన RBI అయితే గుడ్డి గుర్రానికి పల్లుతోముతోంది. మన దేశ కార్పోరేట్ కంపెనీలు డార్క్ వెబ్ అనే అదృశ్య నెట్వర్క్ ద్వారా నల్ల సామ్రాజ్యలో సంపాదించిన నల్ల ధనాన్ని క్రిప్టో కరేన్సీల్లో యధేచ్చగా తరలిస్తున్నారు. UNCFF (United Nations Framework Convention on Climate Change) పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో పెట్టిన ‘కార్బన్ క్రెడిట్’ లను మన వాళ్ళు ట్రేడింగ్ చేసి మూకుమ్మడిగా దాని విలువను పెంచేసి ఘనమైన డబ్బులు ఆర్జించారు. ఉన్న నల్ల ధన్నాన్ని తెల్లగా చేయడానికి మనకు తెలియని ఘరానా మార్గాలు ఎన్నింటినో అనుసరిస్తున్నారు. మన దేశం లో ఇటువంటి ట్రేడింగ్ లపై నియంత్రణ ఏది? కేవలం కంపెనీల చట్టం, 1956 ప్రకారం రిజిస్టర్ చేసుకొని, RBI, SEBI అనుమతి లేని బోలెడు అంతర్జాతీయ సంస్థలు యదేచ్చగా ట్రేడింగు ఎక్ష్చెన్జి లనుఎర్పాటు చేసుకొని నలుపును తెలుపు చేసుకుంటున్నాయి. ఇది సామాన్యులకు అర్థంకాని ఎన్క్రిప్టెడ్ క్రిప్టో ట్రేడింగు. భారత దేశం కొన్ని క్రిప్టో కరేన్సీలను అడాప్ట్ చేసుకునే యోచనలో ఉన్నట్టు కొన్ని నిఘా వార్తలు విన్నాను. భారత దేశంలో ఇప్పటి ప్రభుత్వం, RBI, SEBI లు మన ఆర్ధిక వ్యవస్థను బుల్దోజింగ్ చేసే గుర్తింపు పొందిన వ్యవస్థలు అనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ పై భారత్ బహిరంగంగా తన స్టాండ్ ని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1 comment:

  1. కరెంట్ అఫైర్స్ లోకజ్ఞానం అంతగా లేని దాన్ని కమెంట లేను మన్నించాలి.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...