ప్రియంవద.....


నువ్వు
నిండైన పూదోటలో
కొన్ని గంధాలు అద్దుకున్న
స్నేహపరిమళానివి!
జ్ఞాపకాల గుమ్మానికి
పచ్చటి తోరణాలు కట్టుకున్న
చిగురువసంతానివి!
మనసు వాకిట్లో
మమకారపు ఊపిరి నింపుకున్న
వలపు హరివిల్లువి!
తాపం రేగిన తనువుకి
విరహ తుంపరలు వెదజల్లిన
తుంటరి తలపువి!
నిశ్శబ్ద హృదయాన్ని
పలుకులతో పరవశింపజేసిన
రసమయ రవళివి!
ప్రాతఃకాల తుషారానికి
పైటకొంగును బహుమతిచ్చిన
వెచ్చని చలిమంటవి!
ప్రదోషకాల లేతవెన్నెలకి
తెల్లని చిరునవ్వులు ధారబోసిన
శ్వేత పద్మానివి!
అగాధమంత బాధకి
ఆనందపు ఆనకట్ట నిర్మించిన
కడలి తరంగానివి!

6 comments:

 1. దారి మళ్ళకు

  ReplyDelete
 2. విరహ తుంపరలు వెదజల్లిన తుంటరి తలపు..ఫీలింగ్ అద్భుతం

  ReplyDelete
 3. మీ ప్రియంవద..
  ఊహా కాల్పనిక జగత్తులో తప్ప
  నిజజీవితంలో ఇంతతి సుమధుర
  రసరమ్య రాగవిలాసిని దొరకడం కష్టం
  మనసుని ఊయలలూగించారు మీ కవితతో!

  ReplyDelete
 4. మధుర ప్రేమ భావన పలికింది.

  ReplyDelete
 5. అద్వితీయమైన ప్రేమకావ్యం.

  ReplyDelete
 6. అపూర్వ ప్రేమరాగం పలికింది.

  ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...