తామసీ...

నేను నిద్రపోయాక నువ్వు రహస్యంగా
నా నుదిటిపై ముద్దుపెట్టి
నీ ప్రేమతో నా అమాయకత్వాన్ని ఒక్కసారి సరిపోల్చుకొని
మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోయేదానివి గుర్తుందా?

నీకోసం ఎదురుచూసే జాబిలై నేనూ
నన్ను చుట్టేసే చీకటై నీవూ
మెళకువలో నీ ప్రేమను పొందడానికి నిద్రనటిస్తూ నేనూ
నిద్రలో నాకు ప్రేమను తెలుపుకోవాలని వచ్చివెళ్తూ నీవూ
అలా ఎన్నెన్ని శరత్కాలపు వెన్నెల్లలో
విరహాన్ని కర్కశంగా కసిరేస్తూ గడిపేశామో కదా?

ప్రేమ పరిమళం నిండిన నీ శ్వాసల్లో
నేను మత్తెక్కిన తుమ్మెదై పరవశించడం
ఉత్తేజమైన నా ముఖంలో
నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్న నవ్వును వెతుక్కోవడం
దారితప్పిన పిల్లల్లా ఒకర్నొకరం ఆసరా చేసుకొని
జీవితాన్ని భారంగానో దూరంగానో
ఒకింత బాధతో మధురంగానే బంధాన్ని ముడివేసుకోవడం
ఇదే కదా ప్రేమైక జీవితానికి సార్థకత సారస్వతమూనూ...  


4 comments:

  1. అత్యంత రమ్యం మీ జ్ఞాపకకాలు

    ReplyDelete
  2. మీ ఈ కవితకు
    కమనీయ భావాలకు
    సజల నయనాలతో అభినందనలు
    ఇంతకు మించి ఏమీ రాయలేను..

    ReplyDelete
  3. పరిపక్వం చెందిన ప్రేమ

    ReplyDelete
  4. మధురం ఈ ప్రేమకావ్యం.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...