మొలత్రాడు - మాళవికాగ్ని మిత్రం - కాళిదాసు

మొలత్రాడు ఎందుకు కట్టుకుంటారో నాకు ఒకసారి డౌట్ వచ్చి ఫెస్బుక్ లో అడిగాను. అపుడు ఎవరూ సమాధానం చెప్పలేదు. హడావుడిలో నేనూ మర్చిపోయా. మొలత్రాడు కేవలం మగవాళ్ళు మాత్రమే కట్టుకుంటారు. ఆడవారు అయితే చిన్నప్పుడు మాత్రమే కట్టుకుంటారు కొందరు. పెళ్ళైన మగాళ్లు భార్య చచ్చిపోతే తీసేస్తారు ... అని మా అమ్మ చెప్పింది. వికిపీడియాలో కూడా అదే ఉంది.
యూట్యూబ్ లో ఒక వీడియో ఎవరో తలకుమాసినవాడు పెట్టాడు పురుషాంగం పెద్దది అవ్వడానికి, ఏవో జబ్బులు రాకుండా ఉండడానికి.. గట్రా అని. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. (* కామెంట్ లో అలాంటివి చెప్పకండి ప్లీస్... శాస్త్రీయత ఉంటే వివరించండి)

కానీ ఆడవాళ్లు కూడా చిన్నప్పుడే కాదు పెళ్లి అయ్యాక కూడా ధరించేవారని ఇప్పుడే నాకు తెలిసింది.

అదెలాగంటే,
మళ్లీ ఇన్నాళ్లకు కాళిదాసు నాటకం 'మళవికాగ్ని మిత్రం' తిరగేస్తే అందులో ఒక సందర్భంలో మొలత్రాడు ప్రస్తావన వస్తుంది. అందులో అప్పటికే అనేక పెళ్లిళ్లు అయిన రాజు తాను కొత్తగా మోజు పడ్డ 'మాళవిక' తో ఉన్నప్పుడు ఆమె ఒకానొక భార్య 'ఇరావతి' చూసి కోపంతో అలిగి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడు ఆమె నడుము భాగంలోని మొలత్రాడు జారి ఆమెను వెళ్లనివ్వకుండా కాళ్లకు అడ్డం పడుతుంది.

అంటే మొలత్రాడుకి లింగ వివక్షత లేదు అన్నమాట... 😊😊😊

ఇప్పటికైనా ఎవరికైనా మొలత్రాడు ఎందుకు ధరిస్తారో తెలిస్తే వివరించండి. నాకు దానివెనుక ఉన్న శాస్త్రీయత నచ్చితే నేను కూడా ఇప్పటినుంచి మొలత్రాడు కట్టుకుంటా😊

1 comment:

  1. మొలతాడు మొగవారికి ఆడవారికి అవసరం అనుకుని పెద్దలు పెట్టారు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...