ఓట్ల మాట...

ఒట్టు పెట్టిన
ఓట్టి మాటలు
ఓటు నీడన సేదతీరగ
జుట్టు నలిసిన
కనికట్టు విధ్యలు
కట్టు కథలై మిగిలిపోగ
బెట్టు చేయక
మట్టి మనుషులు
నోటు కోసమై పాకులాడగ
పొట్ట నిండినా
గట్టు మేస్తే
మంటలన్నీ అల్సరవగ

ఇంకెక్కడ ప్రజాస్వామ్యం
ఏనాడో చెదలుపట్టింది
ఇంకెక్కడ రాజ్యాంగం
ఏనాడో పదును తగ్గింది

అందరూ అవినీతికి తొత్తులే
అన్నీ అనవసరపు పొత్తులే
ఎప్పుడూ ఎత్తుకు పైఎత్తులే
చివరకు జనాల పీకపై కత్తులే

' రావాలెవడో ఒకడు
రగిలించాలందర్లో వెలుగు '

యుగాలెన్ని మారినా చెప్పుకునే మాటే ఇది.
జగాలు తలకిందులైనా మారని మాటే ఇది.

మళ్ళీ ఓ సారి చెప్పుకుందాం!
హాయిగా ఓట్లేసి నిద్రపోదాం!!

13/12/2013

2 comments:

  1. వినోద్ గారు.. మీ బ్లాగ్ ఇదే చూడడం. చాలా వరకు మీరు రాసి ఓ పదిహేను వరకు ఒకే సారి చదివేశాను. అన్నిటికీ కలిపి ఇక్కడే కామెంట్ పెడుతున్నందుకు మరోలా అనుకోకండి. సామాజిక ఇతివృత్తాన్ని సాధారణ పదజాలంతో సామాన్యుల
    నాలికలమీద ఆడే విధంగా కొన్ని. రోమాన్స్ కి రొమాన్స్ నేర్పుతున్నాయి మరికొన్ని. బాగున్నాయండి..

    ReplyDelete
    Replies
    1. సంతోషం! సతీష్ గారు.. అన్నీ కలిపి కొట్టేసారన్నమాట! మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...