మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.

ప్రపంచ ఆత్మహత్యా నిరోధక దినోత్సవం సందర్భంగా నా కవిత    
కంప్యుటర్ లో నేను గీసిన చిత్రం


ధుఃఖ సాగరాలను మధించగల మానవా !
స్మశాన సుఖమెందుకు దండగ .


గెలుపు వాకిట విజయబావుటా ఎగురవీసే మిత్రమా!
చితిమంటల చావెందుకు వృధాప్రయాస.


పేకమేడల భవితకు ఊపిరి పోసే నేస్తమా !
ఉరి కోయ్యలతో నేయ్యమేల బ్రతికుండగా .


విధి ఆడే వికృత క్రీడలో పావులు కాదు మనం.
బలిపశువులు అసలు కానేకాదు మనం.


విధినేదిరించడమే మన సంకల్పం.
చావనే నేస్తం మాత్రం దైవాధీనం .
 
 
 
- వినోద్

1 comment:

  1. కవిత బాగుంది. చిన్న చిన్న ప్రమాదాలున్నాయి. అంతే.

    ఉరి కోయ్యలతో ---> ఉరి కొయ్యలతో (లేఖినీ ప్రమాదం)
    నేయ్యమేల ---> నెయ్యమేల (లేఖినీ ప్రమాదం)
    బలిపశువులు అసలు ---> బలిపశువులసలు (సంధి నిత్యం. ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధి నిత్యము!)
    విధినేదిరించడమే ---> విధినెదిరించడమే (లేఖినీ ప్రమాదం)

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...