ఈ కాలం లో మనందరి బ్రతుకులు ఇలా ఏడ్చాయండి బాబు...

http://fc04.deviantart.net/fs11/i/2006/169/e/0/Black_white_by_AeryValley.jpg
నిలువుటద్దపు ప్రమిద 
చూపదు 
మన అంతః స్వరూపం
ముసుగేసిన మనసు 
తెలుపదు
మన మదపుటెత్తులు
వెంబడించే  చాయ 
సలుపదు
మన వికృత చేష్టలు
అరువు తెచ్చుకున్న 
అబద్దపు
మూటలు మన మాటలు
కరువు విడిచినా కన్నీరు 
రగిలించే
తూటాలు మన బాటలు.
హుతభుక్దహనం 
మిన్న
ఈ స్వార్థపు బ్రతుకుల
కన్నా.

1 comment:

  1. నిలువుటద్దపు ప్రమిద అనేది కొత్త ప్రయోగం. బాగుంది. కాని నా కర్ధమయిందికాదు.

    వెంబడించే చాయ సలుపదు అనేది కూడా అర్ధం కాలేదు.

    కన్నీరు రగిలించే తూటాలు అనే ప్రయోగం బాగుంది. కాని తూటాలు మన బాటలు అన్నప్పుడు వింతగా ఉంది.

    మొత్తంమీద నాకు సరిగా పట్టుబడలేదు యీ కవిత.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...