నీపై మోజుపడ్డా...



ఒక పువ్వు కొమ్మని విడిచి
నేలరాలుతున్న క్షణాన
జలదరించిన నా తనువు సాక్షిగా...

సిగ్గుతో మంచుపైట కప్పుకొని
ఒద్దిగ్గా అందాలు ఆరబోసే అడవిపై
మోహం పెంచుకున్న నా ఆరాధన సాక్షిగా...

చల్లని వెన్నెలకాంతిలో
విరహంతో అల్లాడుతున్న మల్లెల్ని
తృప్తిపరిచిన నా వెచ్చటి స్పర్శ సాక్షిగా..

ముళ్ళున్నాయని మొహమ్మాడ్చుకొన్న
గులాబీలను ముద్దుతో పలకరించి
వికసింపజేసిన నా పెదాల సాక్షిగా..

భానుడు వెళ్తున్నాడన్న బాధతో
రక్తసికమైన సాయంకాల సంద్రాన్ని చూసి
చెమ్మగిల్లిన నా కనుపాప సాక్షిగా...

ఓ ప్రకృతీ..!
చదివేకొద్దీ చలింపజేసే భావానివి నువ్వు!
ఆస్వాదించేకొద్దీ పెరిగే మోహానివి నువ్వు!
ఎంతనుభవించినా తీరని దాహానివి నువ్వు!!
అందుకే నీపై మనసుపడ్డాను...
మనిషినై చాలా ఋణపడ్డాను....

నిజం చెప్పాలంటే
నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను!!

7 comments:

  1. వినోద్ ,

    చాలా చాలా బాగుంది .

    ఓ ప్రకృతీ..!
    చదివేకొద్దీ చలింపజేసే భావానివి నువ్వు!
    ఆస్వాదించేకొద్దీ పెరిగే మోహానివి నువ్వు!
    ఎంతనుభవించినా తీరని దాహానివి నువ్వు!
    అందుకే నీపై మనసుపడ్డాను...
    మనిషినై చాలా ఋణపడ్డాను....

    నిజం చెప్పాలంటే
    నేను నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను!

    ReplyDelete
  2. ప్రకృతి పై మోజుమీరు పడ్డారు మీరు వ్రాసిన పదాల మోజులో మేం పడ్డాం.

    ReplyDelete
  3. మోజు పడ్డం వరకూ బాగానే ఉంది.
    కళ్యాణమనకు కరుసైపోతావు వినోద్
    ప్రకృతితో గేంస్ ఆడొద్దు....:-)

    ReplyDelete
  4. ఇంతకీ ఈ ప్రేమంతా ప్రకృతిపైనేనని మమ్మల్ని నమ్మమంటారా! :-)

    ReplyDelete

  5. చాలాబాగుంది .

    ReplyDelete
  6. మొత్తానికి ప్రేమలో పడ్డారు :-) మీ బ్లాగ్ చాలా అందంగా ఉందండీ

    ReplyDelete
  7. చదివేకొద్దీ చలింపజేసే భావానివి నువ్వు!
    ఆస్వాదించేకొద్దీ పెరిగే మోహానివి నువ్వు!

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...