ఒరేయ్ కవి..



ఒకప్పుడు
మొక్కలే మొలవని మదిలో
అక్షరాలపూలను పూయించావ్...
పచ్చదనమెరుగని ఆలోచనల్లో
పసిడిపంక్తుల్ని పండించావ్ ...

కాలానికి జలుబుచేసిందని
కలం కరిగించి ఆవిరిపట్టావ్ ..
కడలి కల్లోలమైందని
కళతో అలల్ని శాంతపరిచావ్....

ఇప్పుడు
ఏవిషాన్ని మింగావని
విషాధాన్ని వర్షిస్తున్నావ్...
ఏఅమృతం అజీర్తిచేసిందని
అసంతృప్తితో విలపిస్తున్నావ్...

ఏకల నీకళ్ళను కనికరించలేదని
రెప్పల్ని అశృనిప్పుల్లో కాల్చేస్తున్నవ్...
ఏమౌనం నీమనసును మోసంచేసిందని
నిరాశతో మోడుబారి ధు:ఖమై చిగురిస్తున్నావ్...

4 comments:

  1. చంపేశారు వినోద్గారు. కవికి ఉండాల్సిన లక్షణాలు

    ReplyDelete
  2. ఒరేయ్ కవి అర్థం కాకున్నావు.:-)

    ReplyDelete
  3. ఒరేయ్ కవి..అని అవమానపరచడం ఏం బాగోలేదండి

    ReplyDelete
  4. ఒరేయ్ వినోద్ చింపేస్తున్నావు నీ కవితలతో.:)

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...